పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228 వ మజిలీ.

చిలుక బ్రహ్మరాక్షసుడైనకథ.

ప్రఫుల్ల - సఖీ ! కాళిందీ ! ఆకోయది శ్రీవిష్ణుని జగన్మోహనావతారమేమో యని తలంతు నయ్యారే! దానిసోయగ మేమని చెప్పుదును? నేను పంపిన మువ్వలు మీ చిలుకకుఁ గట్టితిరా? విశేషము లేమైనఁ గనంబడినవియా ?

కాళింది – (నవ్వుచు) నేనుగూడ నిన్నిట్లే యడుగుచున్నాను. నీమాట చెప్పినతరువాత మామాటఁ జెప్పెదము.

ప్ర - రుక్మివతియు నట్లే యనునా.

రుక్మివతి – సందియమేలా మేమిరువురము నిన్నామాట యడుగుటకే వచ్చితిమి.

ప్ర - చెప్పెద వినుండు. నాచిలుక నామువ్వలు గట్టినతోడనే మనోహరత్వమున నొప్పినది. తెలిసినదియా ?

కాళిం - తెలియ కేమి ? విను మని మా చిలుకలకును గట్టినంత మా కత్యంత ప్రియతమములై యొసంగినవని యెఱుంగుము.

ప్ర — బళాబళ! ఇట్టిచోద్యము లెన్నడును కని విని యెఱుం.గముగదా ! కానిండు మీప్రియతముల ప్రతిబింబములు తీసికొని వచ్చితిరా ?

కాళింది - ఆ. ఇవిగో చూడుము. నీమనోహరరూపము గూడ జూపింపుము అని పలికినది,

ప్రఫుల్ల వారిచ్చిన చిత్రఫలకములు రెండును జూచి యాశ్చర్యపడుచుఁ దాను వ్రాసిన కళాభిరాముని చిత్రఫలకము వానిప్రక్క జేర్చి మూడును నొక్కపోలికగానుండుట పరిశీలించి యౌరా! యీ కోయది యింద్రజాలవేదినివలెఁ దోచుచున్నది. చిలుక లేడ యీదివ్య