పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/200

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకలుగుఱ్ఱములైనకథ.

187

సుబ్బి — మేము చోరీచేయలేదండీ. మాఅల్లుఁడు కొనితెచ్చిందియుందండి.

దండ - దానికి మాకు సూపూవోయి.

సుబ్బి - సాహేబుగారూ! వారిదికూడా సూడక నా దేసూడడ మేమండీ?

దండ - అరే. అందరిది చూస్తామోయి. పదపద లోపలకు

సుబ్బి - సాహేబుగారూ! పులావులోకి మంచి సన్నబియ్యం మున్నవి. తమయింటికి పంపనాండి?

దండ — అరే పులావుగిలావు ఇప్పుడు పనికిరావు. పదవోయి. నీఘర్రు సూడాలి. అని వానిం గెంటుకొని లోనికింబోయి పెరటిలో నాజానేయమైన గుఱ్ఱమును జూచి యాశ్చర్యపడుచు, అరే! కోమటీ! ఈఘోడా నీకీయెక్కడిది?

సుబ్బి - ఇది మాయల్లుడిదండీ. మాదికాదు. అతఁడు చాల భాగ్యవంతుఁడు మొన్న దీనినెక్కి యిక్కడకు వచ్చినాడండీ. ఎక్కడకొన్నాడో మాకుఁ దెలియదండీ.

దండ --- అరే కోమటీ! నీమాటలు ఝూటాగా నున్నవి. నీకీ అల్లునికీ ఈలాటి ఘోడాలూవోయి అని పలుకుచు నాగుఱ్ఱమును వీధిలోనికిఁ దోలించుకొనిపోయి నిలబెట్టి పరీక్షించుచుండెను.

సుబ్బి — సాహేబుగారూ! ఈలాటి గుర్రాలు వాళ్లయిళ్లలో గూడ నున్నాయిగందా. వారి నడుగ రేమీ? నన్నొక్కండనే నిర్భంధింతురా?

దండ - అరే నీకీతొందరయేలా! వారికీ ఘర్రులు చూస్తామోయి.

అమాటలు విని యావర్తకులుమువ్వురు తమ పెరటికోని గుఱ్ఱముల విప్పి రెండవదారిని వీధిలోనికిఁ దోలి తలువులువైచి యీవలకు వచ్చి నిలువంబడిరి. అప్పుడు దండనాధునితోఁ సాహేబుగారూ!వారే