పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదమహర్షి కథ.

7

ముల విష్ణునారాధించిన మహర్షితుల్యుండగును. నామాట విని పెండ్లియాడుమని బోధించిన నారదుం డంజలివట్టి యిట్లనియె.

మహాత్మా! నీవు సర్వజ్ఞుండవయ్యు నా కి ట్లసత్పథము బోధించుచుంటివేమి ? ఇది నాకర్మముగాక మఱియేమి ? స్త్రీలలో మంచివా రుందురుగాక సంసారము జలబుద్బుదమువంటిది కాదా ! జులరేఖయెట్లు మిథ్యయో సంసారమునట్టిదే. యెండమావులయందు దప్పిదీర్చికొనఁదలంచినట్లు పునర్భవంబున సౌఖ్యంబుగోరుట నిష్ఫలంబుసుమీ! తండ్రీ హరిదాస్యము విడచి విషయభోగములకుఁ బొమ్మందు వేమిపాపము. మూఢమానవులను విషయేచ్ఛ పురుగులకు మనోహరముగాఁ గనంబడు దీపశిఖవంటిదియై యంటిన నశింపఁజేయును. మత్స్యబంధనమువలె ముట్టినందగిలికొనును. జనకా ! ఈ సంసారమున నెవ్వని కెవ్వతె ప్రియురాలు. ఎవ్వని కెవ్వడు మిత్రుఁడు. బంధువుఁ డెవ్వడు? ఏటికట్టియలవలెఁ గర్మోర్ములచేఁ గూడికొని విడిపోవుచుందురు. గహనమువంటి సంసారమునఁ బ్రవేశింప నా కిష్టములేదు. కృష్ణాశ్రయ మంత్ర ముపదేశింపుమని ప్రార్థించుటయుఁ బరమేష్ఠి సంతుష్టినొందక యంతటితో నాప్రస్తావము విరమించెను.

దక్షుండును దండ్రియాజ్ఞ నసిక్నియందుఁ బదివేలమంది పుత్రులంగనియె. వారందఱు బెండ్లియాడఁ బ్రయత్నించుచుండ నారదుం డేదియో యువదేశించి వారినెల్ల దిక్కులపాలు గావించెను. అందులకు వగచుచు దక్షుండు మఱియు బెక్కండ్రబుత్రులం బడసి ప్రజాసర్గంబు గావింపుఁడని యుపదేశించుటయు నతని మాటలు పాటింపక వారు గూడ నారదోపదేశంబున దేశములపాలై పోయిరి.

ఆవ్వార్తవిని దక్షుండ క్షీణకో పాటోపంబున నారదుకడకు వచ్చి నీవేకాక నాబిడ్డల నందఱ సన్యాసులఁ గావించితివే అసూయా