పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/199

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గోయవాఁడు సామీ! మీరు దీనింగొంటిరిగదా. వెలమీకుఁ దెలియదా? ఎఱుఁగనట్లు అడిగెద రేల! అని యుత్తరమిచ్చెను. సరే. నీవుసుబ్బి సెట్టి గుఱ్ఱము నమ్మెదననియొప్పుకొంటికివిగదా. దీనిగూడనమ్మి పెట్టుము. వానికన్న నెక్కుడు సొమ్మిత్తు నని చెప్పెను. అతం డొడంబడి యీవలకువచ్చి అట్లే తక్కిన వర్తకుల యిళ్ళకుగూడఁబోయియందలి గుఱ్ఱములఁజూచి సంతసించుచుఁ గోయదొర రేపువచ్చి వాని నమ్మెదనని చెప్పి యానాఁటి కింటికింబోయెను.

లోక మసూయాపరతంత్రమైనదిగదా! మఱునాఁడు సూర్యోదయముకాకమున్న యిరువురుభటులతో యవనకులస్థుఁడు దండనాధుఁడు సుబ్బిసెట్టి యింటికి వచ్చి వీధి నిలువంబడి.

దండ - అరే! సుబ్బి సెట్టికి ఎవడూరా యిక్కడ.

సుబ్బి - (గుండెఝల్లుమన నెదుటకువచ్చి సలాము చేయుచు) సాహేబుగారాండి నేనే సుబ్బి సెట్టిని.

దండ — అరే. బాంచోత్, నీవేనా! నీకీ ఘోడాకు చోరీ చేశావని నీపై మాకు హుకుంవచ్చింది. నీకీ ఏమి సెప్తావోయ్ .

సుబ్బి - సాహేబుగారూ! మామర్యాద మీఱెఱుఁగరా ! మేమాలాటి ఝూటాకోరుపనులు సేసేవారము కాము కిట్టనివారెవ్వరో మీకిట్లు తెలిపియున్నారు.

దండ — అరే. బాంఛోత్ మీకీఘఱ్ఱూలో ఘోడాకియున్నదాలేదా? అది సెప్పువోయి ?

సుబ్బి - మాయింట్లో యుండడమేమీ! రామి సెట్టి, పాపి సెట్టి పెద్దిసెట్టిగార్లింట్లో మాత్రము గుఱ్ఱములు లేవా! నన్నొక్కని నే నిర్భంధింతు రేల?

దండ - అరే. వాడికిజోలీ నీకీఏల! నీమాట సెప్పువోయి.