పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకలుగుఱ్ఱములైనకథ.

185

సుబ్బి - అబ్బో ! మాఅల్లుఁడు తూర్పురాజ్యమునుండి దీనిం గొనివచ్చెను.

కోయ - దీనికివెల యెంత యిచ్చెను ?

సుబ్బి - నీవు వెలగట్టిన పిమ్మటఁ జెప్పెదను.

కోయ -- దీనికింత వెలయనిలేదు. లక్షరూప్యము లిచ్చినను ఇట్టి గుఱ్ఱము దొరకదు.

సుబ్బి - సంతస మభినయించుచు, ఆలాగేమి ? మంచి మాట చెప్పితివి. మాయల్లుఁడు చిన్నగుఱ్ఱము తెమ్మనిన దీని నెక్కువ సొమ్మిచ్చి తెచ్చినాఁడు. దీని మేము భరింపజాలము. దీని నమ్మి పెట్టుము. నీకు బహుమతి నిత్తుము.

కోయ — అట్లే చేసెదంగాని లెస్సగా మేపుచుండుము. అని వారు మాట్లాడుచుండఁగా నాప్రక్కఁ గావురమున్న రామి సెట్టి తన గోడకు నిచ్చెన వేసికొని చూచుచు నామాటలన్నియు నాలించెను. కోయవాఁ డాయింటి గుమ్మము దిగినతోడనే రామి సెట్టి వానిం దనయింటికి రమ్మని సంజ్ఞచేసెను. ఆసన్నగ్రహించి యాసన్న వర్తియగు సుబ్బి సెట్టి వాని నందుఁబోవలదని యాటంకపరచెను. ఆవిషయమై వారిరువురును జేతులెత్తి తిట్టుకొనిరి. వారిజగడములు జూచి నవ్వుచు గోయదొర సుబ్బి సెట్టి మాట వినిపించుకొనక రామిసెట్టి యింటికిం బోయెను? కోయదొరం

రామి సెట్టి కోయదొరను మెల్లగా లోపలికిఁ దీసికొనిపోయి పారశీక జాతంబగు గుఱ్ఱము నొకదానిం జూపెను. కోయదొరం జూచి యావాఱువము గంభీరముగా సకిలించినది. అతఁడు దానిందువ్వుచు సెట్టిగారూ! మీరీగుఱ్ఱము నెట్లుసంపాదించితిరని యడిగిన నతండు సుబ్బి సెట్టి గుఱ్ఱమును నీవు జూచితివిగదా. అదియు నిదియు నొక్కచోటనే కొంటిమి. వీనిలో నేదిమంచిదియో వెల చెప్పుఁడని యడిగినఁ