పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/196

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకలుగుఱ్ఱములైనకథ.

183

సరము లేదుగా. అనుటయు నట్లేచేయఁదలచితిని గాని నీవేమందువోయని సంశయించితిని. రేపు కోయదిరానిచో వానినే తీసికొని వచ్చెదనని చెప్పినది.

రాజపుత్రిక యంగీకరించి నేఁడు మధ్యాహ్నముగూడ వీధిం గాచికొని యుండుమని చెప్పి దాని నంపినది.

కోయదొర చిలుకమువ్వలోయని యఱచుచు రాజవీధులం దిరుగుచుఁ గ్రమంబున నొకకోమటివీధికిం బోయెను. ఆవీధిని వరుసగా సుబ్బిశెట్టి, రామిసెట్టి, పాపిసెట్టి, పెద్దిసెట్టి, అను పేరుగల నలువురు వర్తకుల దుకాణములున్నవి. సుబ్బి సెట్టికోయదొర కేకవిని తటాలున నంగడిదిగి వానికడకు బోయి వానిచేతనున్న మువ్వలబుట్ట బట్టుకొని కోయదొరా ! నిన్నవచ్చిన కోయది నీకేమగును? మాకుఁ గొన్ని పైడిమువ్వలమ్మినది. మీకడనున్న మువ్వలన్నియుఁ దీసికొనిరా? ఏకముగాఁ దీసికొనియెదమని చెప్పితమి అంగీకరించి పోయినది. మేము మారుబేరపు వర్తకులముగదా? ఏదో కొంచెము వెలతగ్గించి ఈమువ్వలన్నియునాకిచ్చి వేయుము తీసికొందును. అని యడుగుచుండ రెండవ యంగడివాఁడు రామిసెట్టి యట్టెలేచి యటవచ్చికోయదొరా! నీమువ్వలకు నేనిబ్బడి వెలయియ్యగలవాఁడ. నన్నియునాకిమ్మని కేకపెట్టెను.

పోపొమ్ము. నేనిదివరకే ధ్రువపరచుకొన్నాను. వీనిభార్యయే నిన్న బేరమిచ్చిపోయినది. తట్టవదలుమని సుబ్బి సెట్టి రామి సెట్టితో బోట్లాడుచుండెను. ఇంతలో మూడునాలుగు దుకాణముల వర్తకులు వచ్చి కోయదొరా ! యిటురా. నిన్నడవివానిఁజేసి వీరు మాయజేయుచున్నారు. సుబ్బి సెట్టికి నీభార్య జట్టి యిచ్చినదను మాట బూటకము వీని నెవ్వరికి నీయవలదు. పాట వేయుము. ఎవ్వరెక్కుడు సొమ్మిత్తురో వారికిత్తువుగాఁక. నీలాభమేలపోగొట్టుకొనియెదవు? అనిచెప్పిరి.

కోయదొర నవ్వుచుఁ జిలకలున్న వారికిఁ గాని నేనీ మువ్వ