పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/193

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఆర్యా! మీయాకారముసూడ నుత్తమవంశ సంజాతులవలెఁ గనంబడుచున్నారు. మీరీ చిలుకరూపు ధరించుటకుఁ గారణమేమి? మిమ్మెవ్వరైన శపించిరా? లేక విలాసమున కిట్టిరూపు దాల్చితిరా? కంతువసంతజయంతాదులలో నొక్కరగుదురని తలఁచితిని కాని మీ కన్నులుజూడ ననిమిషులుకారని తెలిసికొంటి. మీకులశీలనామాదు లెఱిగించి నాకు శ్రోత్రానందము గావింతు రే యని వినయముగా నడిగిన నతం డిట్లనియె.

పడతీ ! నావృత్తాంత మిదమిద్ధమని చెప్పుటకు నింకను నాకు బోధపడకున్నది. పిమ్మట జెప్పెదంగాక నీవెవ్వని కూఁతురవు. ఈ గృహ మెవ్వరిది? నేనిక్కడి కెట్లువచ్చితిని. నీపేరేమి? నీవృత్తాంతము జెప్పుమని యడిగిన నమ్మగున యిట్లనియె. సౌమ్యా! ఈనగరమునకు గిరివ్రజమని పేరు. మాతండ్రి పేరు సోమదత్తుఁడు. ఆయనయే యీదేశమునకధికారి. నా పేరు ప్రఫుల్ల యండ్రు. ఇది నాయంతఃపురము. రెండునెలలక్రిందటఁ గొండవాండ్రు, మూడుచిలుకలనమ్మఁదెచ్చిరి. అందు నేనొకటియు నాసఖురాండ్రు కాళిందీ రుక్మవతులిరువురు చెఱియొకటియు గొనినారము. ముద్దుగాఁ బెనుచుచు మాటలనేర్పుచుంటిమి. నేఁడొకకోయది పైడిమువ్వలుదెచ్చి వీనిఁజిలుకలకుగట్టినగట్టిగా మాటాడఁగలవని చెప్పియిచ్చిపోయినది. వానింగట్టినంతమీరీరూపముదాల్చితిరి. ఇదియే మీయాగమనవిధానము. తరువాతి వృత్తాంతమునకుమీరే ప్రమాణమని పలికి యూరకన్న నొక్కింత ధ్యానించి యతండిట్లనియె.

నాతీ ! నేనొక దేశాధిపతి కుమారుండ. నాపేరు గళాభిరాము డందురు. మే మేవురము సోదరుల ముత్తరదిక్కు జయింపబయలుదేరి పెక్కెండ్రరాజుల జయించితిమి. ఒకనాఁడొక పెద్దకొండగాలివిసరి గఱ్ఱములతోఁగూడ గొట్టకొనిపోయి యొకకొండయెక్కి యందలి తటాకజలఁబులఁ దీర్థమాడితిమి. అది స్వప్నయో నిజమో తెలియ