పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కాశీమజిలీకథలు - పదియవభాగము.

తండ్రీ ! నన్ను స్త్రీనిఁ బరిగ్రహింపుమని బోధించుచుంటివి. ఆమాట వినిన నాహృదయము దద్దరిల్లుచున్నది. స్త్రీస్వభావము నీ యెఱుంగనిదా. వినుము.

సీ. వేదశాస్త్రములందు వెలఁదులచరితముల్
              గడుదుష్టముగఁ జెప్పఁబడవె తండ్రి ?
    అశ్రుత శ్రుత్యర్థుఁడగు దుష్కులుఁడు గాక
              ప్రాజ్ఞుండు నమ్ము నే పడఁతుకలను
    మనసులో సుభగుఁ గన్గొని పొందఁ గోరుఁ బైఁ
              బ్రకటించు ఘనపతివ్రత యనంగ
    ముదిమిదప్పినవాని మది శత్రువుగఁ జూచు
              యౌవనవంతు సంస్తవము జేయు

గీ. సకలదోషంబులకు ఠావు జలరుహాక్షి
    మది ముముక్షువులు మఱచియు ముదితఁ జూడ
    గూడ దాసింపఁగూడ దెక్కొలఁదినైన
    విషమువంటిది వాల్గంటి వివిధగతుల.

ఆమాటలు విని హాటకగర్భుండు నవ్వుచు నిట్లనియె. పుత్రా! నీవు స్త్రీజాతియంతయు దోషయుక్తమని నిందించుచుంటివి. అది తెలిసిన మాట కానేరదు. స్త్రీ లేనిచో సృష్టియే లేకపోవును. దుష్కులజ తలిదండ్రుల దోసంబున స్వతంత్రురాలై భర్తయాజ్ఞ నుల్లంఘించుఁగాక స్త్రీలందఱు నట్టివారలే యగుదురా ? సత్కులంబునం బుట్టిన యువతి పతివ్రతయై పతిసేవఁ జేయుచున్నది. పతివ్రతాప్రభావము నీ వెఱుంగనిదియా ! సాధ్వీతిలకము కన్నెఱ్ఱఁజేసిన మూడులోకములు గడగడలాడవా ! సాధ్వియందుఁ బుత్రులంగని వృద్ధుండై తపోవనమున కరుగవలయు. గృహస్థుఁడు బాహ్యాభ్యంతర