పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/187

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఆకాంతను వింతగాఁ జూచుచుఁ బౌరు లూరక మూగి వెనువెంట దిరుగుచుండిరి. సాయంకాలమునకుఁ దట్టలోనున్న మువ్వగుత్తులన్నియు నమ్మినది. చీఁకటిపడినతోడనే బసలోని కరిగినది. మఱునాఁడు బయదేరి క్రమ్మఱ నూరంతయుఁ దిరిగి నాఁడు జాముపొద్దువేళకే మువ్వల నమ్మినది.

మూడవనాఁడు రెండుజాములకే మువ్వలగుత్తు లై పోయినవి. నాలుగుదివసములు లట్లు పట్టణమంతయుఁ దిరిగి మువ్వలమ్ముచుండ నా యండజగమున సోయగము మాటలు చేష్టలు పౌరు లద్భుతముగాఁ జెప్పికొనుచుండిరి. ఆపట్టణప్రభువగు సోమదత్తుని కూఁతురు ప్రఫుల్ల యను చిన్నది మిక్కిలి చక్కనిది. చాల చదివికొన్నది. తొలిప్రాయములోనున్నది. అప్పడఁతి యెప్పుడును వింతవస్తువులజూడ వేడుక పడుచుండును.

భద్రిక యను పేరుగల యామెపరిచారిక యొకనాఁడామెకడకుంబోయి దేవీ ! ప్రఫుల్లా ! మనయూరొక కోయెదివచ్చి చిలుకలకు నగలుగాఁ గట్టదగు మువ్వలగుత్తులమ్ముచున్నది. దానిచక్కదనము నీవు జూచిన మిక్కిలి మెచ్చుకొనియెదవు. తదవయవములన్నియు మొలచినట్లు పోసినట్లు దిద్దినట్లొప్పు చున్నవి. ఆహా!

ఉ. కోయదియంచు దాని ననుకోఁదగదమ్మకచెల్ల! యద్భుత
     శ్రీయుతముల్ తదంగములు జేరలుమీరుఁ గనుల్ గళంబు నం
     కోయనఁబోల్చుఁ దేనెలొలుకుం బలుకం నగినంత నెన్నెలల్
     గాయుఁ గనం గుచద్వయవికాసము మోసముసేయు మానులన్ .

అక్కలికిచక్కఁదనం బటుండనిమ్ము. అక్కొమ్మ యమ్ముచున్న పైడిమువ్వలు చిలుకకాలికిం గట్టిన వింతగాఁ బలుకునఁట. మాటలు రాని చిలుకలఁ బలికించునఁట. మనము మొన్న క్రొత్తగాఁగొన్న కొండచిలుక లెస్సగాఁబలుకనేరదు. ఆకోయెతను మన హజారముకడ