పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/182

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమద్వరకథ.

169

మూఁగికొని వెఱపుతో నుపచారములు సేయుచుండిరి.

ప్రమద్వర కారణము తెలియక తెల్లబోయిచూచుచు నవ్వా! అట్లు పరితపించితి వేమిటికి ?నాయొడలిలో దోషమేమియును లేదు. ఊరక పండుకొంటి. వెఱఁపులేదు. లెమ్ము. లెమ్ము అని పిలచిన నామె యెట్టకేలకు లేచి యాప్రోయాలు చూలాలగుట నిశ్చయించి ముక్కు పై వ్రేలిడికొని యౌరా! ఆమహారాజు గ్రామములోనుంచినఁ బురుష సంపర్కంబు గలుగునని మహారణ్యమధ్యంబున నిడి సంరక్షింపుచుండ నిట్లు జరిగినదా! సెబాసు! నేనీవార్త రాజునకుఁ దెలయఁజేయక తప్పదు. అతండేవచ్చి వీని శిక్షించుగాక. అని ధ్యానించుచుఁ గన్నుల నీరుగార్చుచుండ బ్రమద్వరయు నితరకన్యకలు తత్కారణము జెప్పుమని గ్రుచ్చిగ్రుచ్చి యడుగఁ దొడంగిరి.

అప్పుడా ముసలిది రాజవుత్రిక నేకాంతస్థలంబునకుఁ దీసికొనిపోయి అమ్మా! నిన్నొక్కమా టడిగెదను జెప్పుము. ఆక్రొత్తదియు నీవు నేకశయ్యయందుఁ బండుకొనుచుంటిరిగదా? అప్పుడది ఏమిచేయు చున్నదియో నిజము చెప్పు మని యడిగినఁ బ్రమద్వరఁ అవ్వా! నా కది యేమియు హానిచేయుటలేదు. నీతోడు. వేడుకలు గలుగఁజేయుచున్నది. అని యదార్ధమంతయుఁ దెలియ జేసినది. ముసలిది యా మాటలువిని కోపస్ఫురితాధరయై నీకు లోకజ్ఞానము లేకపోవుటయు ముప్పునకే కారణమైనదని కసరుచు వెంటనే రాజపుత్రున్నొద్దకుం బోయి చురచురం జూచుచుఁ దులవా! నీవెట్టిపని సేయుచుంటివి? ఆఁడుదానననిచెప్పి యతఃపురద్రోహము సేయుదువా? నీగుట్టు బయలు బెట్టి నిన్నేమిచేయింతునో చూడుమని యదలించిన నతండు నవ్వుచు నిట్లనియె.

అవ్వా! నేనాఁడుదాననని నీతోఁ జెప్పితినా? మగవాఁడనని చెప్పితినా? మీరే నన్నాఁడుదానిగాఁ జేసితిరి. ఇప్పుడుమాత్రము