పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదమహర్షి కథ.

5

     నూహింప వక్షస్థలోద్భూత దుర్మాంస
             పిండముల్ బంగారుకుండలనుచు
     నస్తిసందర్శన వ్యాపారము రుభావ
             భాసురాంచిత మందహాస మనుచు
     దూషిత రుధిర మేదోమాంస చర్మాస్థి
             నిచయంబు ఘనతటిత్ప్రచయ మనుచు

గీ. మానినీగాత్రముల కల లేనిపోని
    వర్ణనలు సేయుచుంద్రు నీ ! వనితఁ దలఁప
    నేవపుట్టెడుఁ బడఁతి గ్రహించుటెల్ల
    జనక ! మెడఁ బెద్దగుదె గట్టికొనుట గాదె.

గీ. భూరిసంసార సాగరాంబువుల నన్ను
    ముంపఁదలఁచితె కాంతాభిముఖునిఁ జేసి
    కలదె నిష్కృతి యెన్ని యుగములకైన
    భవజలధి మున్గినట్టిజంతువున కభవ !

చ. సుతునకుఁ దండ్రియే సుగతిదొప్పెఱిఁగింపక సక్తుఁడై యథో
    గతిఁ బడఁజేయఁగా నతని గాచెడు వా రెవరింక తండ్రి ! శ్రీ
    పతిచరణారవింద యుగ భక్తి ఘటిల్లగఁ జేయుమయ్య ! బల్
    నెతబడ దారసంగ్రహణ వృత్తికి నామది యొప్పదెన్నడున్ "

అనుటయుఁ జతురాననండు వత్సా! సమస్తాశ్రమములలో గృహస్థాశ్రమ ముత్తమమని మహాత్ములు సెప్పియున్నారు. దేవతా తిధి పితృ తృప్తి గృహస్థులవలనం గలుగుచున్నది. గోవులు పానశాల సేరునట్లు గేస్తు నెల్లరు నాశ్రయింతురు. నీ వుత్తమకన్యం బెండ్లియాడుము. భార్యాస్వీకరణమున కంగీకరించిన మరీచ్యాది మహర్షుల కంటె నీ వెక్కు డెఱుఁగుదువా! బాబూ ! పెండ్లియాడుము నేనానందింతు, నని పలికిస విని నారదుండు తాలువులెండ భీతుఁడై యిట్లనియె.