పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/179

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అతం డామెపాడుమన్న రాగము పాడుచు నేర్పుమన్న గీతము నేర్పుచు శృంగారముచిలుకు పలుకులతో నక్కలికిని మరుములుకుల బారిం బడసేసెను. అతండు స్త్రీయనియే భావించుచుండియుఁ దదంగ మేళనంబు హృదయంబునఁ గ్రొత్తయనురాగము గలుగఁజేయుచుండ నయ్యండజగమన సంతతము నతనితోఁ గలసిమెలసి వర్తింపుచుండును. ఇరువురకు నొక్కటియే భోజనము ఒకటియే తల్పము ఒక్కటియే యభిలాషగాఁ గొన్నిదినములు గడచినవి. ప్రమద్వర యతనిం జూడక గడియ తాళదు. అతనిమాట జెప్పనవసరమేలేదు.

శ్లో. వినోపదేశం సిధ్ధహికామోనాఖ్యాత శిక్షతః
    న్వకాంతా రమణోపాయే కోగురుర్మృగపక్షిణాం.

అంత నొకనాఁటిరేయి యత్తలోదరి యారాజపుత్రునితో నిట్లనియె. పడఁతుకా! ఇది యేమిగొడవ యిదివఱ కిట్టిపని సేసియెఱుంగమే మాబోఁటులీవిద్యయెన్నఁడుం జెప్పిరి కారేమి! వాండ్ర కిది తెలియదా? ఇది మిక్కిలి వినోదము గలుగఁ జేయుచున్నది చుమీ! అని పొగడుచుఁ దత్క్రీడావిశేష ములచేఁ దన్మయత్వము నొందినది.

అందున్నవారిలో నొక్కవృద్ధతక్క తక్కిన కన్యకలందరు ప్రమద్వరవలెనే శిశుతనంబుననె యందుఁ జేర్పఁబడినవారగుటయుఁ బురషోపసృత్తముల నేమియు నెఱుంగరు. అనుదినప్రవర్థమాన రాగాభివృద్ధితోఁ బ్రమద్వర తత్కేళీవినోదములం జొక్కుచుండ నొక్క నాఁడక్కుమారుం డామె కిట్లనియె.

రాజపుత్రుఁడు -- ప్రేయసీ ! మనకేళీవిశేషము లెన్నఁడును . మీయుపాధ్యాయినితోఁ జెప్పకుమీ!

ప్రమద్వర - చెప్పినం దప్పేమి?

రాజు - చెప్పకుండ నుండలేవా!

ప్రమ — ఉండలేను. నన్నామెయు మందలించదు. దీనిలో