పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/177

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అవ్వా ! నీయెఱుంగని ధర్మములుండవు. స్త్రీలకు గోటలు నగడ్తలు శుద్ధాంతములు వస్త్రములు ఆవరణములుకావు. వృత్తమే యావరణమని చెప్పఁబడియున్నది. వసుప్రియునకుఁబురుషశబ్దమే వినని కన్యకం గోడలిగాఁ జేయుతలంపు గలిగినది. నాకు దేశసంచారము జేసి యాత్మేచ్ఛా విహారంబునం బెండ్లియాడువలయునని బుద్ధిపుట్టినది. ఇట్లే లోకులకు భిన్నాభిప్రాయములు గలిగియుండును. నే నింకను వివాహమాడలేదు. మీరాజపుత్రికతోమైత్రి గలిసినదికాదా. సజ్జన సహవాసంబు శోభనంబులఁ గూర్పకమానదు. ఆమెతో నేను వివాహమాడెదనని యుత్తరముచెప్పెను.

ఆమాటలువిని యావృద్ధ ముద్దియా నీసుద్దులువినినఁ బెద్దయు జదివినదానివలెఁ గనంబడు చుంటివి. నీకు లోకజ్ఞానము లెస్సగా నుండును. మారాజవుత్రికడ నెన్నఁడును. బురుషచర్యా ప్రసంగము తేవలదుచుమీ. ఈమాటయే జ్ఞాపకముంచుకొనవలయునని చెప్పుచుండఁగనే యొక పరిచారిక వచ్చి అవ్వా! ప్రమద్వర యుప్పరిగపైఁ గూర్చుండి సంగీతము వినుచున్నది. ఆమెపేరేమియో నాకుఁ దెలియదు క్రొత్తగా వచ్చినదఁటకాదా! ఆమెను వేగముగాఁ దీసికొని రమ్మన్నది. అని చెప్పిన విని వృద్ధకొమ్మా! పదపద ప్రమద్వర నీకొఱకుఁ వేచియున్నదట మఱచియైన నామాట పలుకకుమీ యని యుపదేశించిన వల్లెయని యతండు పరిచారికవెంట మేడమీఁదికిబోయెను.

అతనింజూచి ప్రమద్వర తటాలునఁ బీఠమునుండిలేచి నాలుగడుగులెదురువచ్చి చేయిపట్టుకొని తనప్రక్కపీఠముపైఁ గూర్చుండఁ బెట్టుకొని సఖీ ! మాయుపాధ్యాయిని వృద్ధాంగనం జూచితివా ? మాట్లాడితివా ! నీకుఁ దగిన సమాధానమిచ్చినదా ? అని యడిగిన నతండు చూచితిని. మాటాడితిని. నీయుపాధ్యాయిని మంచితెలివిగలదని యుత్తరము జెప్పెను. అప్పు డప్పడతి యతని రంజింపఁద