పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కాశీమజిలీకథలు - పదియవభాగము.

శ్రీవ — అట్లైన వినుము. మా దేశములో నుత్తరభాగమున మహారణ్యము గలదు. అందు స్వాదుజలఫలతరు మనోహరంబగు నుపవనంబొండు నందనవనంబునుబోలి యొప్పుచున్నది. అవ్వనంబుజట్టును బ్రహారిఁబెట్టించి యౌవనము వచ్చుదనుక నాపుత్రిక నందుంచి సమ ప్రాయముగలకన్యకలనూర్వురతోఁబోషింపించెదను. అనుమతింతువా?

వసు — (చెవిలో నేదియోచెప్పి) అట్లు చేయుము. దానివలనఁ బ్రమాద మేమియు జరుగదు. అని చేయఁదగిన నియమములన్నియు బోధించెను. వసుప్రియుఁ డంగీకరించి యట్టి యేర్పాటుఁ గావించెను. మహారణ్యమధ్యమందున్న యీవనముచుట్టు పెద్దగోడ పెట్టించి పడమరదెస నొక్కటే సింహద్వార మేర్పరచెను. ఇందనేక విచిత్రభవనముల నిర్మింపఁజేసెను.

ప్రమద్వరకు మూఁడేండ్లు దాటినతోడనే నూర్వుర ధాత్రేయుల దాసీసహస్రముల సమప్రాయము గలబాలికల వేయిమంది సహాయముగానిచ్చి చేయవలసిన కృత్యములన్నియుఁ బోధించి వీరందఱకుఁ చదువుచెప్పునట్లు నన్ను పాధ్యాయినిగా నియమించి యిదుఁ జేర్పించెను. ఇందున్న జవరాండ్రందఱు నామెతోఁ బెరిగినవారే. తలిదండ్రుల నెఱుంగనివారే. పెద్దదాసీలందరు దేశమునకుఁ బంపఁబడిరి సంవత్సరమున కొకసారి శ్రీనగరమునుండి శ్రీవర్థనుఁడు సంభారములఁ బంపుచుండును. స్త్రీలే తీసుకొనివత్తురు.

ఈవార్తలన్నియు నెఱింగినదాన నేనొక్కరితనే యిందుంటిని. తక్కినవారి కెవ్వరికి నీరహస్యము తెలియదు. శ్రీవర్థనుఁడు వసుప్రియుని యుపదేశంబున నీప్రాంతమందున్న యొక మహాయోగి నాశ్రయించి యేవియో వరములు వడసి వచ్చెనఁట. దానంజేసి మాకు వ్యాధులవలన మృగములవలనఁ జోరులవలన బాధగలుగుటలేదు. ప్రమద్వర సంప్రాప్తయౌనయై యున్నది. వసుప్రియుని కుమారుఁ