పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/173

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కొంతపిచ్చి యుండకమానదు. నీవుమంచిసమయములోనే ప్రస్తావము దెచ్చితివి కావున జెప్పెదవినుము. నాకుమారుసకుఁ జేసికొన దగిన గుణములుగల కన్య దొరుకుట కష్టము. నీకూఁతు నిప్పటినుండియు నట్టిదానిగాఁజేయ దలంపుగలిగియుంటివేని నాకుమారునకుఁబెండ్లిజేకొనియెదను.

శ్రీవ - నీకోడలి కెట్టిగుణము లుండవలయునో చెప్పు మిప్పటి నుండియు శిక్షించి యట్టిదానిగాఁ జేసెదను.

వసు — జనసంఘమందుఁ బెరిగిన కన్యకల నెట్లు శిక్షించినను సంపర్కదోషంబునఁజేసి దుర్గుణము లలవడకమానవు.

శ్రీవ — ప్రత్యేకము పండితుల నుపాధ్యాయులుగా నియమించి కావ్యనాటకాలంకార గ్రంథములు చదివింతును. పతివ్రతాచరిత్రముల బోధింపఁజేయుదును. ఇష్టమున్న సంగీతముగూడఁ జెప్పింతు వలదనిన మానిపింతును. ఏమందువు ?

వసు - సరి సరి. మంచిమార్గమే. పురుషులకడఁ గావ్యనాటకాలంకార గ్రంథములు చదివించినచోఁ గన్యకలకు వేరేకామతంత్ర రహస్యము లుపదేశింప నవసరములేదు. బిల్హణచరిత్రము నీవు చదివియుంటివా ! శ్రీవ - స్త్రీలు పురుషులకడఁ జదువఁగూడదనియా, కావ్యములే చదువఁ గూడదనియా, నీయభిప్రాయ మేమియో నాకుఁ దెలియకున్నది.

వసు — వయస్యా ! నాయభిప్రాయము వినుము. పురుషసహవాసంబునఁ గన్యకలకుఁ గామాది దుర్గుణము లుదయించును. అలవడిన గుణము బోఁగొట్టుకొనుట నరుంధతికిని శక్యముకాదు. పైకి మహాపతివ్రతలవలెఁ దోచుచుందురు కాని మనసుచేతను వ్యభిచరింపని స్త్రీయుండదు. నేను స్త్రీ చిత్తదోషముల బాగుగ నెఱుంగుదును. సుందరుఁ డైన వురుషుం జూచినప్పుడు స్త్రీకి బుద్ధిమారును.

శ్రీవ — అందుల కేమందువు ? స్త్రీలందరు వ్యభిచారిణులనియే