పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/172

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమద్వరకథ.

159

ములుక్రింద వ్యయపెట్టెను. మహారాజులనెల్ల నధికవ్యయమున కోర్చి గౌరవప్రతిపత్తులతో సత్కరించెను. మఱియు నద్భుతతేజంబునఁ బ్రకాశించు నాబాలికామణికిఁ బ్రమద్వరయను పేరుబెట్టెను.

క్రమంబున వచ్చిన బందువులు ప్రభువులు సామంతులు తమ తమదేశములకుఁబోయిరి. వసుప్రియుఁడను నేపాళచక్రవర్తి మాత్ర మానృపతి కత్యంతమిత్రుఁడగుట నతని నిర్బంధమున మఱికొన్నిదినము లందు వసించెను. ఆడుపిల్ల పుట్టినతోడనే తలితండ్రులు దానికి సంబంధము లాలోచించుచుందురు. అందుఁ జక్రవర్తుల బిడ్డలకు దగిన సంబంధము దొరుకుట మఱియుఁ గష్టము. శ్రీవర్ధనుం డొకనాఁడు వసుప్రియునితో ముచ్చటించుచు నిట్లనియె.

మిత్రమా! యిప్పుడున్న రాజులలో మనకున్న మైత్రి యవ్యాజమైనది. ఇంటికిఁ బోయెదనని నీవూరక తొందరపడియెదవు. నీకుమారుని బారసాలకువచ్చి నేనాఱుమాసములు వసించితి జ్ఞాపక మున్నదియా? మఱియు నీతో నొకసంగతి ముచ్చటింపఁ దలంచుకొంటిని. అప్పుడే తొందరయేమని : పరిహాసమాడెదవేమో నాకిప్పటికి డెబ్బదియేండ్లు దాటినవి. నేఁటికిగదా యుత్సవమని పేరుపెట్టి మిమ్ముల నందఱిని రప్పించుకొంటి. నీకుమారునకైదేండ్లున్నవి. నాకు నీతో వియ్యమందవలయునని యభిలాషగానున్నది. అమాట నీతోఁ జెప్పుటకు నేటికి గదా నాకధికారము గలిగినది. వివాహమునకిప్పు డే తాంబూలములు పుచ్చుకొందము, అన్నివిధముల మన యిరువురకు సరిపోవును. మనమైత్రి దీన మఱింత బలమగు నీయభిప్రాయ మేమనవుఁడు నవ్వుచు నానరేంద్రుఁడిట్లనియె.

వయస్యా! నీయభిలాష నాకానందము గలుగఁజేయుచున్నది, కాని నెలయైన నిండకుండ బెండ్లికిఁ దాంమూలములు బుచ్చికొనిరనిన నొరులు నవ్వకమానరు. అదియట్లుండె. ప్రతిపురుషునకు నేదియో