పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరదిగ్విజయము.

155

గుఱ్ఱమును వడిగాఁ దోలవచ్చునా భయములేదుగద అని యడిగినది. అతఁడు నవ్వుచు నీయిష్టము వచ్చినంతవడిగా నడిపింపుము నా కేమియు వెఱపులేదని యుత్తరమిచ్చెను.

అప్పు డప్పడఁతి మడమలతో నించుక సూచించినంత నాహయం బతిరయంబునఁ బరుగిడఁ దొడంగినది. కొంతదూరమేగునప్పటికిఁ గొందరు సుందరు లెదురుగాఁ బరుగెత్తుకొనివచ్చుచుండిరి. లలనా ! నిలు నిలు నిన్నీవాఱువ మెంతదూరము లాగికొనిపోయినది? అయ్యో నీవు పడితి వేమో యని యడలుచుంటిమి, నీజాడఁ దెలియక సఖులు నలుమూలలకుఁ బరుగిడిపోయిరి. నీవెనుకఁ గూర్చున్న జవ్వని యెవ్వతె? మన కోటలోని కెట్లువచ్చినది? అని యడిగిన నాప్రమద్వర యిట్లనియె.

బోటులారా ! నా ఘోటక మింతవిపరీతముగా నెప్పుడును లాగికొనిపోలేదు. ఖలీన మెంతలాగినను నిలిచినదికాదు. ఈచిన్నది యెవ్వతియో నాకునుం దెలియదు. ఈకిసలయపాణి యొక రసాల పాదపమునీడ గూర్చుండఁ నాబాడబమీచేడియ ననీడమునకుఁ దీసికొనిపోయి నిలువంబడినది. ఈమె నన్నేదియో యడిగినదికాని నా కేమియుం దెలిసినదికాదు. అంతయు నాసఖులు వక్కాణింతురు రా. రమ్మని గుఱ్ఱమెక్కించి తీసికొనివచ్చితిని. మీరు వేగరండు, మాటాడుదురుగాక. అని చెప్పి యప్పడఁతి గుఱ్ఱమును దోలినది. గడియలో నాహయంబు గమ్యస్థానము జేరినది అందు,

సీ. నానాప్రసూనప్రతాననీ కమనీయ
             కాయమానాఢ్య ప్రఘాణకంబు
    నవరత్నఘటిత సుందరకవాటద్వార
            దేహళీకుడ్య సందీపితంబు
    శుకపికోత్క్రోశ సంశోభితమణిభర్మ
            పంజరాఢ్యకపోత పాలికంబు