పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/165

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బాపికొందును. అనిదానిపయింబడి పెద్దయెలుంగున దుఃఖించుచు నవయవయముల ముట్టె ముద్దుపెట్టుకొనుచుఁ జెమ్మటలు వాయవీచుచు గొంత సేపున్మత్తక్రియల గావించెను. తనకుఁదాన యుపశమించుకొని మొలలోజొనిపియున్నకత్తిచే నందొక గర్తముత్రవ్వి దానినందు దొర్లించి దానిమేను బూవులచే బూజించి కన్నుల నీరుధారగాఁగారఁ బూడ్చి వేదికగాఁగట్టి దానిపైఁ దురగాకారముగా గీచిపలురకములఁ బూవులేరితెచ్చి హరిసహస్రనామములుచ్చరించుచుఁ బూజించి ప్రదక్షిణ నమస్కారములుగావించి దేవునివలె నర్చించెను.

నాఁ డెల్లఫలమైనందినక యుపవాసముండిమఱునాఁడుక్రమ్మఱఁ బూవులంబూజించి ధ్యానించి యాకలి యడంగ నేవియోపండ్లుభుజించెను. రాత్రుల నా వేదికపై శిరంబిడుకొని యాహరింధ్యానించుచు నిద్రపోవును. పదిదినంబులట్లు జరిపినంత నొకనాఁడురేయి నతనికలలో నాహరివరంబు గనంబడి రాజపుత్రా! నీవు నా నిమిత్తమై వగవం బనిలేదు నాకుత్తమలోకంబు కలిగినది, నీకృతజ్ఞతకు వేలుపులు మెచ్చికొనుచున్నారు. నీవిట గదలి పడమరగాఁ బొమ్ము నీకుమేలయ్యెడు గాక అని చెప్పినది.

అదరిపడిలేచి యాచిన్న వాఁడు కల తెఱంగరసికొని యోహో నావాహనము మృతిజెందియు నాకుపకారము సేయఁదలంచుచున్నది. నాజన్మావధిలో దీనిపేరు మఱచువాఁడనా! ఇందుఁబోయిన నా కేదియో మేలగునఁట తదుపదేశంబు గురూపదేశంబుగాఁ దలంచి పోయి చూచెదంగాక. అనితలంచి యప్పుడాచుట్టుప్రక్కలనున్న వృక్షలతావిశేషంబులం బరిశీలించి చూచెను.

కుసుమ కిసలయ ఫలదళ విలసితములగు నందలి పాదపలతా విశేషముల కాలవాలములు గట్టఁబడి నీరుపెట్టఁబడుచున్నది. అదివఱ కతండా యాలవాలములనీరు గ్రోలియు ఫలంబులఁదినియుఁ బుష్పం