పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/164

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరదిగ్విజయము.

151

లక్షణములుగలది. అతనిమనసు ననుసరించి నడుచునది ఱెక్కలుగలదివోలె నెగయఁగలదు.

అతండాతావు గుఱిజూచికొని గుఱ్ఱమెక్కిదూరముగాఁదీసికొనిపోయి యందుండి పరుగెత్తించి కళ్లెము పైకిలాగి యాగోడదాటింప నూతచాలక రెండుసారులువెనుకకు మరలవలసివచ్చినది. మూడవ తేప నతండు కళ్లెము బిగ్గరగాలాగి మడమలతో గొట్టుచుఁ బ్రాణములు వోయినను; నీమాటు కోటదాటక తప్పదని సంజ్ఞచేయుచు వేగముగాఁ దోలుటయు నాసక్తి తనకున్నశక్తియంతయు జూపి ఱెక్కలుగలది వోలె నెగసి యతికష్టముమీఁద నాగోడపై లంఘించినది.

పాప మాతురంగము రెండునిమషములు మాత్రమాగోడపై నిలువంబడి వెంటనే లోపలదూకుటచే నలయిక యెక్కువయగుట గిలగిలఁ దన్నుకొని ప్రాణములు వదలినది. దానిపాటుఁజూచి రాజకుమారుఁడు దుఃఖించుచు నయ్యో! యుచ్ఛైశ్రవంబుతోఁ బ్రతిఘటింపఁజాలు నాతత్తడి యిట్లు మిత్తిపాలగుటచే నీలోపలఁజేరిన సంతోషము విఫలమైనది. అక్కటా! దుర్ఘటంబగు పనిచేయించినా ప్రాణబంధువుం గోలుపోయితినిగదా! ఆహా యిట్టియుత్తమజాతి వీతి నాకీ జన్మమున లభించునా? నానిమిత్తమై తనశక్తియంతయుంజూపి మిత్తివాతంబడిన యీ జంతువుఋణంబెట్లు తీర్చుకొందును? ఆ మహావాతంబునంబడి కొట్టుకొనివచ్చునపుడు నాకించుకయు నొప్పితగులకుండ వెన్నునంగట్టికొనికష్టపడి తలపూవు వాడకుండ నన్నిందుఁ దీసికొనివచ్చి కాపాడిన యీపుణ్యాత్మురాలిట్లు సమసినంజూచుచున్న నావంటి కృతఘ్నుడెందైనంగలఁడా! హా! తురంగరత్నమా! హా! పరమోపకారీ హా! హరిప్రవరా! నన్ను విడచిపోయితివా ! నీప్రాణములర్పించి నాఋణముతీర్చికొంటివా! యీలోపల నా కేమిపనియుండి నీచే నిట్టి దారుణక్రియ జేయించితిని? నిరర్ధకవ్యాపారమున నిన్నుఁబరిమార్చిన నాపాపమెట్లు