పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/162

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరదిగ్విజయము.

149

లతాగుల్మాదులఁబట్టుకొనినను నాగలేక గుఱ్ఱముపై పోయు పోయి సాయంకాలమునకుఁ బర్వతమువంటి యొకగోడ యడ్డమువచ్చుటయు నొడ్డుతగిలిన యోడవలె నాబాడబంబాగి నేలంబడినది. అంతలో గాలియుఁ జల్లారినది.

విద్యాసాగరుఁడు గుఱ్ఱమునుండి నేల కొఱుగుటచేఁ గొంచము దెబ్బతగిలినది. సవరించుకొనుచు మెల్లనలేచి గుఱ్ఱమున కాయాసము దీర్చి నలుమూలలు సూచెను. చీఁకటులు దెసల నావరించు చుండెను. అప్పుడేమూలనుండి యెంతదూరము వచ్చెనో యతనికిఁదెలిసికొనుట శక్యముకాలేదు. ఎటుసూచినను మహారణ్యమే కనంబడుచుండెను. తన్నాపినది పాషాణమోపర్వతమో గోడయో తెలియఁబడలేదు. ఏమిచేయుటకుఁ దోచక గుజ్జపుజీనునకుఁ జేరఁబడి యిట్లుతలఁచెను.

అయ్యో! ఇట్టి యుపద్రవమెప్పుడును గనివిని యెఱుగను. ప్రళయకాలంబున మహావాతంబు బయలుదేరి పర్వతముల దూదిపింజలవలె నెగరగొట్టుసని పురాణముల వినియుంటిమి. నేటి కామాట సత్యముగాఁ దోచినది. అబ్బా! ఆగాలివేగము దలంచికొనిన గుండె ఝల్లుమనుచున్నది. నాగుఱ్ఱము మిక్కిలి బలముగలది కావున నింత దూరము పరుగిడఁగలిగినది. ఆయుశ్శేషంబుండఁ బట్టినేనుదానిపైనిలువఁ గలిగితిని లేకున్నఁజావవలసినదే. మాతమ్ములేమైరో తెలియదు. న్నేఁటితో మాదిగ్విజయయాత్ర పూర్తియైనది. తండ్రిగారు జెప్పినట్లే యైనది. పులింజూచి నక్క వాతలుపెట్టికొను నట్లుగా మాయన్నలువలె వత్తుమని బయలుదేరితిమి. మంచిప్రాయశ్చిత్తమైనది. దేశాధిపతులం జయించి యింటికిఁబోక యుత్తరదేశారణ్యములఁ జూడవలయునని బుద్ధియేమిటికి బుట్టవలయును? ఈకాంతారములలో నేమియున్నవి! సీ! మే మే పురముగూడ వట్టి మూర్ఖులమైతిమి. కానిమ్ము ఇప్పుడువగచినంబ్రయోజనంబేమి? భగవంతుని సంకల్పమేమియో తెలియదు. జంతువులకు