పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/160

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరదిగ్విజయము.

147

దనేక దేశములు ప్రఖ్యాతములగు పర్వతములు ప్రసిద్ధములగు నరణ్యములు నతి పవిత్రమగు పుణ్యక్షేత్రములు పెక్కులు గలిగియున్నవి. తద్దిగ్విజయము సేయ వేడుకగలుచున్నది. సెలవిండని కోరిన నవ్వుచు నవ్వసుమతీశుం డిట్లనియె.

వత్సలారా! మీరింకను ధనుర్వేదము బూర్తిఁజేయలేదు. అన్నలు దూర్పుదెసకరిగి మణికాంతా వస్తువాహనములు సంపాదించికొనివచ్చిరిగదాయని మీరుకూడనట్లేయాపనికిఁ బ్రయత్నించుచున్నారు. ఒకరియదృష్ట మొకరికెన్నఁడును రాఁజూలదు విజయమనునది మాటలతో లేదు. మీయన్నలుపడ్డకష్టములుమరణ ప్రాయములుకావా? వారి పూర్వపుణ్యము శరణ్యమై మర్మములఁ గాపాడినది. అందఱికి నన్ని వేళలు సమముగానడువవు. అదియునుగాక మీయన్నలు తెచ్చిన ధన మనంతముగా నున్నది పది తరముల దనుక ననుభవించినను తఱుగదు ఇంటికడ సుఖంబుండుఁడని యుపదేశించిన విద్యాసాగరుం డిట్లనియె. తండ్రీ! భ్రాతృవిత్తమున జీవించువా రధములు కారా? మత్త మాతంగ కుంభపాటన దక్షంబగు హర్యక్షంబు క్షుద్రమృగమాంసమున కాసించునా? నిర్వక్రపరాక్రమంబున విజృంభించి చక్రవర్తుల బాదాక్రాంతుల గావించి తద్దత్తములగు విత్తముల విత్తములెన్న నీవసుమతియే రాజన్వతియని పేరువంద ననుభవింతుముగాక. అనుజ్ఞ యిండు మాతల్లిగారియాజ్ఞ గైకొని వచ్చితిమని పలికిన నతండు వారి యుద్యమము వారింపజూలక యెట్టకే ననుమతించెను.

వారేవురు వీరవేషముదాల్చి చతురంగ బలములు సేవింప శుభముహూర్తమున నిల్లువెడలి యుత్తరాభిముఖులై పోయిపోయి

సీ. మాళవ నేపాళ మగధ కాశ్మీక కో
             సల కురు ప్రముఖదేశములకరిగి