పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/157

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పోయి మనకుఁగావలసినన్ని మణులు తీసికొనిరాగలను. మనమందరము సుఖముగా ననుభవింతమనియచ్చట ముచ్చట లెఱింగించి నవియే పలుమూరు చెప్పుచుండఁ దనివి తీరక వినినవార్తలే మనలనడుగు చుందురు.

వీరవర్మ ప్రతాపరుద్రునితోఁ దమ్ముడా. మీవదిన చిత్రసేనకుఁబినతల్లికూఁతురు తేజోవతియను యువతి మిక్కిలి చక్కనిది. అదియు సప్సరస్సంజాత పద్మసేనతో సమముగాఁ బెనుపఁబడినది మీతమ్ములలో నెవ్వరికైనఁ బెండ్లిచేయుఁడని నన్ను బద్మసేన గోరినది. అందులకై యాయిందువదన నిందు దీసికొనివచ్చితిని. మన తమ్ము లిరువురు తరుణుల స్వీకరించిరి. నీవే యస్వీకృతదారుండవై యున్నావు. తేజోవతిం బరిగ్రహింపుమని చెప్పెను. ఆమాట కందరు ననుమోదించిరి. నాఁడే యాకొండశిఖరమున వారికి వివాహముఁ గావించిరి. అయ్యుత్సవములతోఁ బ్రొద్దులు పుచ్చుచున్న సమయంబునఁ గన్యాకుబ్జమునకరిగిన దూతలు పటురయంబున నరుదెంచిరాజదంపతుల సేమముదెలిపి మీరాకకైవారు గడియలు లెక్క పెట్టుచున్నారు. మావాచకశ్రవవణసమయమే ప్రయాణసమయముగాఁ జేయవలయునని కోరిరి. అనిచెప్పినంతఁ తొందరపడుచు వీరవర్మ యప్పుడే ప్రయాణసన్నాహము గావింపుఁడఁని యాజ్ఞాపించెను.

అచలమునుండి తెచ్చిన మణికనక వస్తువిశేషము లన్నియు నేనుంగులపై నెక్కించిరి శుద్ధాంత కాంతల నాందోళికా యానములు నధిరోహింపఁజేసిరి. రాజపుత్రులు గుఱ్ఱములెక్కిరి. భేరీభాంకారాది భూరిధ్వానంబులు భూనభోంతరాళములునిండఁ జతురంగబలముల కోలాహలములు జలధి ధ్వానంబు ననుకుకరింవ మహావైభవముతో బయలుదేరి యెడనెడ శిబిరములువైచి విడియుచుఁ గతిపయ ప్రయాణంబుల నిజనగరమున కరిగిరి.