పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/156

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయమల్లునికథ.

143

అత్తరుణీమణులును మఱఁదులం గాంచి వారి నమస్కారము లందుకొని దీవించుచుఁ బెద్దగా నాదరించిరి. ఇంతలో గొలుసంతయుఁ బైకివచ్చినది. మందసములు దాపున నున్నవని పరిజనులువచ్చి చెప్పిన తోడనే యందఱు నాగుహాంతరమునకరిగిరి.

నిగళాంతమునందలి మందసములు నాలుగు గుహాంతరముచేరిపతోడనే పరిజనులు తలుపులు విడఁదీసిరి. వీరవర్మ సుథన్వుఁడు మఱియిరువురు వీరులు నందుండి యీవలకువచ్చిరి. మృతిజెందినవారు బ్రతికివచ్చిన నెంత సంతసింతురో యట్టి ప్రీతితోఁ దమ్ములు మువ్వురు వారిద్దఱం గౌగలించుకొనుచు నానందభాష్పములచే శిరంబులం దడియఁ బెద్దతడవెలుంగురాక కంఠములు డగ్గుత్తికఁజెంద నానందపరవశులై యుండిరి.

పిమ్మట వీరవర్మ తమ్ములనెల్ల నాదరించుచు నగ్గిరికూట శృంగాటకమునకుంజని యందొకచో విశ్రమించి వారుచేసినకృత్యములన్నియు గ్రమ్మఱఁదమ్ములకడ నుపన్యసించెను.

అన్నదమ్ము లొండొరులుపడినకష్టసుఖము లెఱింగించికొనుచుఁ గొన్ని దివసములా గిరిశిఖరంబున విశ్రమించిరి. సుధన్వుఁడు తాను వరించిన దేవకన్యకల సౌందర్యతిశయంబు, నాలోక రామణీయకము, వర్ణించుచుఁ దమ్ములనెల్ల విస్మయసముద్రములో నీదులాడఁజేసెను. వారినేమిటికిఁ దీసికొనివచ్చితివికావని యడిగిన నమ్మగువలు త్రికూటాంత ర్భాగమునుండి యీవలకు రారు. నాకెల్లకాలము నందుండుట కిష్టములేదు. విదేశమెంతసౌఖ్యప్రదమైనను స్వదేశవాసానందమునకు సరిపడదు. అప్పుడప్పుడువచ్చి పోవుచుందునని సమాధానపఱచితిని. అందలి యైశ్వర్య మీరత్నములే తెలుపుచున్నవి చూడుఁడు పెక్కే.ల ఆగ్గిరిశిలలన్నియు బంగారము మణులేకాని పాషాణములు కావు. ఒక్కరత్నము వెలకు మనరాజ్యము సరిపడదు. అప్పుడప్పుడు