పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/155

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గిన నతండు తన యుదంతము సాంతముగా నెఱింగించెను. ఇట్లొండొరుల ప్రవృత్తులొండొరుల కెఱింగించుకొని యారాజకుమారు లిఱువురు సంతోషముతో దుందుమారుని కోటలోనికిం జనిరి.

రాగవర్ధనుని మిక్కిలి వినయముతో నర్చించి యా ఱేఁడు తానుజేసినతప్పును గాపాడుమని వేఁడుకొనియెను. అతండతనియెడఁ బ్రసన్నుఁడై తన సేనలనెల్ల జయపురముకనిపి జాగుసేయక వెంటనే తమ్మునితో గూడ పేరుగలవారుపములనెక్కి సముచిత పరివారము సేవింప నన్నలజాడ తెలిసికొనఁ జిత్రకూటగిరి పరిసరమున కరిగెను.

అం దుండి యిరువురు యోధులు తురగములెక్కి కన్యాకుబ్జపురంబున కరుగుచు దారిలో వీరికిఁ గనంబడి గుఱుతుపట్టి సలాములు సేయుచు భర్తృదారకులారా! మీరు సేమముగా వచ్చుచుంటిరా? మీయన్నలు సేమముగానున్నారు. పాతాళలోకమునుండి బైటికి వచ్చుచున్నారు. ఈశుభవార్త తలిదండ్రులు కెఱిగింపఁ బ్రతాపరుద్రుఁడుగారు మమ్మందుఁబంపుచున్నారు. మీరు గూడ నందుఁ బొండు. మేము పోయివత్తుమని చెప్పి యాసాదులు వెళ్లిపోయిరి.

ఆవార్తవిని రాజపుత్రులిరువురు ప్రహర్ష పులకితగాత్రులై యత్యుత్సాహముతో నాశైల శిఖరమున కరిగిరి. ప్రతాపరుద్రుఁడు వారి రాకఁ జూచి సంతోషించుచురాగవర్ధనుని వృత్తాంతంబడిగి తెలిసి ముఱియుచు జయమల్లుఁడు పెండ్లికొడుకయ్యెనని యెఱింగి తమకు మంచికాలము వచ్చెనని యానందించుచు నచ్చటి వార్తలన్నియు వారికిం జెప్పి పాతాళలోకమునుండి బంగారు రత్నములు మందసములతోఁ బంపిరి. వీరవర్మ భార్య పద్మసేనయు సుధన్వుని భార్య రత్నావతియు ద్విజటయు మఱియొక పొన్ని కొమ్మయు నమ్మకమగు దాస దాసీజనంబులు పైకివచ్చి నాశిబిరములోనున్నారు చూడుఁడు. అనిచెప్పి యచ్చటికిఁదీసికొనిపోయి వేఱువేఱువారివారి పేరులుచెప్పి చూపెను.