పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/153

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అతం డెట్టకే నంగీకరించి మీరనన్యసామాన్య ప్రతాపగర్వితులని నే నెఱుంగుదును. అయినను వేగిఱించి యుద్ధమునకు దిగరాదు. సామముననే కార్యము నెఱవేరునట్లు ప్రయత్నింపవలయును. జాగరూకులై కార్యము సాధించుకొని రండు పొండని పలికెను.

ప్రతాపరుద్రుఁ డొక్కరుఁడు సేనా నివేశము కడకుఁ బోయెను. నేను బలముతో జయపురమునకు వచ్చుచు నొకనాఁడు రాత్రి యీనగరప్రాంతమునందు సేనలతో విడిసితిని. ఈదుందుమారుండు చారులవలన నారాక తెలిసికొని తెల్లవారిన మేము తమ్ముఁ బరిభవింతుమని జడియుచు మంత్రులతో నాలోచింపక యర్ధరాత్రంబున కొన్ని సేనలంగూర్చికొనివచ్చినిద్రించుచున్న మా పయింబడి మాబలములఁ జీకాకు పఱచి నన్నుఁ బట్టుకొని చెఱసాలఁ బెట్టించిన మాట వాస్తవమే మఱియు దఱువాత చరిత్రవినుము.

అతని మంత్రి మిక్కిలి బుద్ధిమంతుఁడు మఱునాఁడావార్త విని రాజునొద్దకుఁ బోయి మహారాజా ! రాత్రినత్యుపద్రవమైనపని గావించితిరి గదా! తాళధ్వజుండు లోకైకవీరుండు అతని కుమారుల బలపరాక్రమములు మొన్నఁటి సంగరములో మనము చూచి యున్నాము. వారి తమ్ముఁ డితఁడును సామాన్యుఁడు కాడఁట నిప్పునొడిగట్టినట్లా రాచపట్టిం గట్టించితివి హతశేషులీపాటి కావీటికి బోయి వారి కీవార్తఁ దెలిపియుందురు, వారు దాడివచ్చిన మన మోపఁగలమా ! అవి మృశ్యకారిత్వము హాని హేతువగుననియెన్నియోదృష్టాంతములు సూపియాభూపునిబశ్చాత్తాపతప్తునిఁ గావించెనఁట

మధ్యాహ్నంబున నారాజుకూఁతురు ప్రభావతియను యువతి యుపహారములు తీసికొని నేనున్న గదితలుపులు తెఱపించుకొని లోపలికివచ్చినది. ఆరమణీమణి సౌందర్యము లోకాతీతమైయున్నది. విస్మయముతో నేనామెంజూచుచుండ నావేదండగమన నాదాపునకు