పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/151

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బయలుదేరిరి. అందుఁ బ్రతాపరుద్రుఁడొక్కఁడు సేనానివేశముకడ కరిగెను. సేనలతోఁగూడికొని జయమల్లుఁడు జయపురమునకు వచ్చుచు నొకనాఁడు సాయంకాలమున రామనగర సమీపంబున సేనతోవిడిసి పటకుటీరములు వైపించెను.

ఆ నగరాధిపతి దుందుమారుండనురాజు జయమల్లుఁడు తనపట్టణము ముట్టడింపవచ్చెనని తలంచి యర్ధరాత్రంబున సేనలతోఁబోయి నిద్రావిద్రాణములైయున్న చతురంగబలములను బరిమార్చి జయమల్లునిఁ బట్టుకొని కట్టించి తీసికొనిబోయి కారాగారంబునంబెట్టించెను. హతశేషులుకొందఱు పాఱి మన నగరంబునకుఁబోయిరి. మేమీ దెసకుఁ బాఱివచ్చి యిన్నగరంబుసొచ్చి మీజాడ యేమైనఁ దెలియునేమోయని వీధులందిరుగుచుంటిమి దైవికముగా మీరిందుఁ గనంబడితిరి. ఇదియే యక్కడి వృత్తాంతమని యెఱింగించిరి.

రాగవర్ధనుండావార్తవిని క్రోధమూర్ఛితుండై యేమీ! దుందుమారుండక్రమముగా మన సేనలంజంపి మాతమ్ముని చెఱసాలంబెట్టించెనా. కానిమ్ము వాని ప్రాయశ్చిత్తము ముందుగాఁజేసి తరువాతఁ జిత్రకూట నగంబుకడ కరిగెదంగాక అని నిశ్చయించి యప్పుడే మామగారినడిగి చతురంగ బలముల సహాయము తీసికొని మంచివేళ బయలుదేరి కతి పయ ప్రయాణముల రామనగర సమీపమున కరిగి యందు శిబిరములవైపించి దండు విడిసి యానృపతికిట్లు రాయబారము వ్రాసిపంపెను.

దుందుమారా! నీవశ్వత్థామవలె నర్ధరాత్రంబున మా సేనలపై బడి పరిమార్చి నిద్రించుచున్న మాతమ్ముని జయమల్లుని జెఱసాలం బెట్టించితివఁట నీవీక్షణమున మాతమ్ముని వెంటఁబెట్టుకొని వచ్చి తప్పు చేసితి రక్షించి విడువుఁడని పలుకుచు నా పాదంబులంబడి గడ్డి గఱచి బతిమాలికొనిన నీవు బ్రతికిపోవుదువు. లేకున్న నిన్నుఁ బుత్ర మిత్రా