పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/150

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయమల్లునికథ.

137

పోయివత్తు ననుజ్ఞయిమ్మని పలికిన నక్కలికి వగచుచు నిట్లనియె.

మీ రొంటిగాఁ బోవలదు. మీ వార్త మాతండ్రికి దివఱకే చెప్పియున్నాను మంచియల్లుఁడు లభించెనని యతండు ముఱియుచున్నాఁడు కొన్ని సేనల వెంటఁబెట్టికొని పొండనిచెప్పినది అతండంగీకరించి యమ్మఱునాఁ డుదయకాలంబున నశ్వశాలకుఁబోయి తనకు దగినవారునము నరయుచున్న సమయంబున నిరువురు యోధులాదారిం బోవుచు రాగవర్ధనుని గురుతుపట్టి యందునిలువంబడి చూచుచుండిరి.

రాగవర్ధనుఁడొక ఘోటకమునేరి దానినాయత్తఱచి తీసికొని రమ్మని రాహుత్తులకు నియమించి యీవలకువచ్చినంత నాయోధులతనికి సలాములుచేసిరి. మీరెవ్వరని యడిగిన భర్తృదారకా! మేము దేవర యోధులమే మిమ్మువెదకుటకై మీతమ్ముఁడు జయమల్లునితో బయలుదేరివచ్చుచు మార్గ మధ్యంబున నతండు జిక్కువడఁ దప్పించుకొని మేమిక్కడికివచ్చితిమని చెప్పుటయు నతండు తొందఱగా వారి కిట్లనియె. మీరుమాయోధులా? మీమాటలేమియునాకర్థము కాలేదు. మాతలిదండ్రులు క్షేమముగానున్నారా? జయమల్లుఁడు చిక్కుపడెనంటిరి. ఆవృత్తాంతము సవిస్తరముగాఁ జెప్పుఁడనియడిగిన వాండ్రిట్లనిరి.

దేవా! మమ్మీ నగరముజేర్చి సత్రములోనిలిపి వారువపు రౌతులు మీ రాక నగరిలోనికిందెలుఁప గోట సింహద్వారముకడకరిగి తిరుగవచ్చునప్పటికిందు మీరు గనంబడలేదఁట నాలుగు దివసంబు లిందు వసించి వాండ్రు మిమ్ము వెదకివెదకి మీ జాడఁదెలియక పరితపించుచుఁ గ్రమ్మఱ మన వీటికరుదెంచి యావార్తఁ దెలియఁజేసిరి. జయదేవుఁడు వెనుకటి పగ మనంబునంబెట్టుకొని మిమ్ము జంపించెనని నిశ్చయించి మీ తలిదండ్రులు పెద్దగా దుఃఖించిరి.

అప్పుడు జయమల్లుఁడును ప్రతాపరుద్రుఁడు వారి నూఱడించుచు మీజాడఁ దెలిసికొని వత్తుమనిచెప్పి వారి నొప్పించి సేనలతో