పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాగవర్ధనునికథ.

135

నీవు మొదటఁజెప్పినమాట మఱచితివి. మీరాజకుమారుఁడు వచ్చుదనుక మిమ్మారాధించుచుండెద ననిచెప్పి యిప్పుడు లేచిపోయెద ననెదవేల. అది స్వవచన వ్యాఘాతముకాదా. మఱియుఁ బాటకు మెచ్చి కానుక నిచ్చెదనన్నఁ దప్పుగాగణించితివి. ఈ విపరీతమెక్కడను జూడలేదు. మీరాజకుమారుఁడు రానీ అతండు తప్పనిన నొప్పుకొనియెదనని పలుకుటయు నక్కలికి యిట్లనియె.

సరిసరి. ఆయనకుఁజెప్పిన నన్నే మందలించును. అట్లైన మీ చిటికెనవ్రేలియుంగరము నాకీయుఁడుమీ పేరు దలంచుచు ధరింతునని పలికిన పక్కున నవ్వుచు నక్కుమారుఁ డాయంగుళీయక మిచ్చెను. దానిం దాల్చుచు నాముదిత ముదితహృదయయై మనోహరా! నే నుంగరమడిగిన నవ్వితిరేల? తప్పాయేమి? అనుటయు నతండు తప్పులు మాకుఁదెలియవు. పాటకుమెచ్చి కోరికొనుమన వేశ్యలమా! అనితప్పుఁ బట్టితివి. ఇప్పుడీ యుంగరమెట్లుకోరితివి. అంగుళీయకము భర్తవలనఁ గాని పరపురుషునివలన లలనలు స్వీకరింపరు. దీనినేమిటికి కోరితివో యనినవ్వితిని. తెలిసినదియాయని నుడివిననవ్వి యవ్వనిత యిట్లనియె.

అయ్యో! ఆసాంప్రదాయము నాకుఁదెలియక దానింగోరితిని. అదియునుంగాక మీరు నాకరగ్రహణము జేయుట మీరన్నమాట బలపరచుచున్నది. దీనివలన మీరునాకు భర్తలగుదురాయేమి సరిసరి మీయుంగరము మీరు తీసికొనుఁడు అని పలుకుచుఁ దన వ్రేలి యుంగరము మఱియొకటి తీసి యంతడు వలదనుచుండ బలవంతమున నతని వ్రేలందొడిగినది. అతండది చూచికొని యోహో ఇది నా యుంగరముకాదు. మఱియొక టిచ్చితివేల! ఈవినియమంబు నేనన్నమాట ధృవపరచినది కదా అనితెలిపిన నత్తన్వి దైవసంకల్ప మట్లున్నది కాఁబోలు తెలియకయే యీకృత్యములు నిర్వర్తిల్లినవి. నన్ను మఱియొక పురుషుఁడు స్వీకరింపఁడు ఇఁక మీరే భరింపవలయునని