పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/145

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

కాశీమజిలీకథలు - పదియవభాగము.

    తతోపి దుఃఖదం పుంసాం దుష్టస్త్రీ సన్నిధౌ ధ్రువం.

హింసించు జంతువుల సమీపమునందు సుఖముగా నుండవచ్చునుగాని దుష్టస్త్రీ సన్నిధి వసించుట కడుంగడు కష్టమని చెప్పలేదా.

రతి — దుష్ట పురుషులకడ వసించుట స్త్రీలకు మాత్రమూ కష్టము లేదా వినుండు.

శ్లో. యేకామినీం గుణవతీంచసయౌవనాంచ
    నారీం నరాః ప్రణయినీంచ విమానయంతి
    తె భోఃకృషీవల వచః పరిదగ్ధ చిత్తై
    గోన్ భిస్సమం పృథుముఖేషు హలేషు యోజ్యః.

గుణవంతురాలగు నిల్లాలి నవమానపఱచిన పురుషుని దుక్కి. టెద్దుప్రక్క నాగలికిఁ గట్టి దున్ను మని బుద్ధిమంతులు చెప్పియుండలేదా.

రాగ — ఓహో రాజకుమారా ! నీకు స్త్రీలయం దెక్కువ యభిమానము కలిగియున్న దే.

రతి - మనోహరా! మనోహరాకారముగల స్త్రీని జూచి మోహవివశుఁడు కాని పురుషుఁ డెవ్వఁ డున్నాడో చెప్పుము. మహర్షులుగూడ వారిం జూచి విహ్వలులై నట్లు పురాణములు ఘోషించుచుండలేదా! అది యట్లుండనిండు అడుగవలసిన మాట యడుగుట మఱచితిని. మీకు వివాహమైనదియా ?

రాగ - లేదు.

రతి - మీకుఁదగిన లావణ్యవతి దొరకక యింతవఱకు వివాహము మానితిరి కాబోలు,

రాగ - ఎట్లనుకొన్నను సరే..

రతి - రాజవుత్రా ! మిమ్మీరాత్రి నెట్లును నిద్రపోనీయను మాయింటఁ జక్కని గాయనీరత్నమున్నది. అనురూపరాగానులాప విలాసములచే మిమ్మారాధింపవలయునని యభిలాష పడుచున్నది.