పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాగవర్ధనునికథ.

131

నల జఘనమందును గేరళాంరగల కేశములందును ఘూర్జరాంగనల కుచంబులందును మన్మధుండు తాండవమాడుచుండునిదియునుంగాక.

శ్లో. ఆంధ్రీపీనపయోధరైణనయనా సర్వాగుణాధికాదక్షిణీ
    కర్ణాటీసురతోపచారచతురా లాటీ విదగ్ధాప్రియా
    క్రూరా మాలవి కాకలాసునిపుణా నిత్యం మహారాష్ట్రికా
    సౌరాష్ట్రీమృగలోచనా సువచనా ద్రవ్యప్రియా ఘూర్జరీ.

రాజపుత్రా! ఈదేశములన్నియు నేనుదిరిగి చూచితిని. ఇట్టి శ్లోకములు వేయిచదువగలను.

రాగ — వయస్యా ! ఏదేశస్త్రీయైననేమి తత్సభావమెట్టిదో తెలిసికొంటివా వినుము.

శ్లో. శ్రుతాపురాఁణె యాసాంచ చరిత్రమతిదూషితం
    తాసుకో విశ్వనేత్ప్రాజ్ఞః ప్రజ్ఞానాంశ్చ గుణాశ్రయః.

శ్రుతులయందుఁ బురాణములందు స్త్రీ చరిత్రము దూష్యముగా వర్ణింపఁబడియున్నది. గుణవంతుఁ డెవ్వఁడు నట్టిస్త్రీని విశ్వసింపఁడు.

రతి - సరిసరి మంచిమాటయే పలికితిరి.

శ్లో. ఫలం ధర్మస్య విభవః విభవస్య ఫలం సుఖం
    సుఖమూలాని తన్వంగ్య: వినా తాభ్యః కుతస్సుఖం.

ధర్మఫలము విభవము విభవఫలము సుఖము సుఖమూలములు స్త్రీలుకారా స్త్రీలులేనిదే సుఖమేల విభవమేల వినుండు.

శ్లో. ప్రజ్ఞాకలా యౌవనజాతి సంపత్సౌందర్య విద్యా మదగర్వితాభిః
    సుదుర్లభాభిర్వర సుందరీ భిస్సంభోగసంజాత సుఖం కథంస్యాత్.

రాగ - అవును నీవు చెప్పినట్లు ప్రజ్ఞ కళ యౌవనము కులము సంపద సౌందర్యము విద్య యిన్ని గుణములుగల కలకంఠులు లభించుట పూర్వపుణ్యమే. కానిచో

శ్లో. వరమగ్నౌస్థితిర్హింస్రజంతూనాం సన్ని ధౌసుఖం