పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/143

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

కాశీమజిలీకథలు - పదియవభాగము.

శ్లో. ఆయుస్సారో యౌవనమృతుసారః కుసుమసాయక వయస్యః
    సుందర! జీవితసారో రతిభోగరసామృతాస్వాదః.

బ్రతికినదినములలో యౌవనకాలమే కాలము వసంతఋతువేఋతువు. రతిభోగరసామృత మనుభవించుటయే జీవితమునకు ఫలమని విద్వాంసులు వ్రాసియున్నారు.

రాగ - మంచిరసికుఁడవే! శృంగారప్రబంధములుచాలఁ జదివితివి కాబోలు.

రతి - చదువుటయేకాదు బహుదేశములు దిరిగి యాయాదేశ స్త్రీల విశేషములఁ దెలిసికొనివచ్చితిని మీకునిద్రలేనిచో వినిపించెద.

రాగ - నీవిట్టిమాటలఁ జెప్పుచుండ నిద్రయెట్లువచ్చును వినుపించుము తెల్లవారువఱకు మేలుకొనఁగలను.

రతి - శ్లో. చోళీచ్ఛన్నాయదికుచతటీదులన్ భాఘూర్జరీణాం
            కచ్ఛాభావాదలఘుజఘనంతహిన్ శక్యావమర్షం
            తద్వ్యత్యస్తం ద్రవిడ సుదృశామంతతః కింతస్స్యా
            దేశత్రైకంభవతి సులభంతద్వదన్యత్ర చాన్యత్ .

ఘూర్జరస్త్రీలు జఘనంబున సన్ననివలువజుట్టి కుచతటంబు దృఢచేలంబుల బిగింతురు. ద్రవిడ స్త్రీలందులకు వినిమయముగా జఘనంబు ఘనవసనావృతంబు గావించి కుచతటంబు పటావృతంబు గాకుండఁ జేయుదు రొకొక్క దేశంబుననొక్కొక్క విశేషంబుగలదు మఱియు,

శ్లో. వాచిశ్రీర్మాధురీణాం జనకజనపదస్థాయినీనాం కటాక్షె
    దంతె గౌడాంగనానాం సులలితజఘనే చోత్కల ప్రేయసీనాం
    త్రైలింగీనాం నితంబె సఘనఘనరుచౌ కేరళీకేశపాశె
    కర్నాటీనాంకటౌచ స్ఫురతిరతిపతిః ఘూర్జరీణాంకుచేషు.

పాండ్యదేశస్త్రీ వాక్కులందును విదర్భ దేశస్త్రీల చూపులందును గాడాంగనల దంతములందును నుత్కల త్రిలింగకర్ణాటదేశాంగ