పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/141

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నావెంటరండు పర దేశస్థులవలె నీసత్రమున వసించుట ధర్మమే! ఈ రాజ్యము మొన్న మీయన్నలు మాకిచ్చినదే కదా ముందుగా వార్తనంపిన సీమకడకెదురురాకపోవుదుమా లెండు లెండు. పుట్టంబులం దాల్పుఁడు అనిపలుకుటయు నతండేమాటయుఁ బలుకలేక సిగ్గుపడుచు దిగ్గునలేచి యామెయిచ్చిన పుట్టంబులంగట్టికొని వినయముతోఁ గృతజ్ఞతఁ జూపుచు నిప్పుడేపోవుదము మాదూతలు రానీయుండనియుత్తరము చెప్పుటయునాయింతియిట్లనియె.

వయస్యా! మీదూతలెప్పటికివత్తురో. అంతదనుక నీసమ్మర్దములోనుండుట కష్టముకాదా! వారికి నేనువార్తనంపిరప్పించెదంగాక లెండు. నాగుఱ్ఱమునెక్కుడు నేను మీగుఱ్ఱమునెక్కెదననిపలుకుచు నతనిచేనట్లు చేయించి తానాతని గుఱ్ఱమెక్కి ముందు నడిపించుచు గడియలో నతని కోటలోనికిఁ దీసికొనిపోయినది.

అందుఁ గ్లేశమువాయ నభ్యంగనక్రియ నుష్ణోదకస్నానము మృష్టాన్నసంతృప్తియుఁ గావింపఁజేసి పిమ్మట ననర్ఘమణి భూషణాంబరంబులం దాల్పంజేసి లోపలి సభాభవనంబునఁ గూర్చుండఁబెట్టి, కొంతసేపు వారాంగనానృత్య గానవినోదములచే నతని నారాధించినది. పిమ్మట రతిమంజరి యారాజకుమారుఁ దనయంతఃపురమునకుఁ దీసికొనిపోయి హంసతూలికాతల్పంబునం గూర్చుండఁ బెట్టి ప్రక్క పీఠంబునఁ దాను గూర్చుండి వినోదముగా నిట్లు సంభాషించినది.

రతిమంజరి -- వయస్యా 'సఖ్యంసాప్తపదీన ' మనియున్నది కదా. మీకు నిద్ర వేళయగుచున్నది. అయినను మీతోఁ గొంత ముచ్చటింపవలయునని వేడుక కలుగుచున్నది. మీదర్శనమంద యాశక్తియున్నది. నాతప్పులు మన్నింప వేఁడుచున్నాను.

రాగవర్ధనుఁడు - (కృతజ్ఞత ప్రకటించుచు) రాజపుత్రా! నేఁడు నీవునాకుఁగావించిన యుపచారములు వేయిజన్మములకై న మఱపు