పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాగవర్ధనునికథ.

127

అప్పుడు తన్నగరాధిపతి జయుదేవుఁ డూరలేఁడు. అతనిభార్య దూతలవలన రాగవర్ధనునిరాకవిని తొట్రుపడుచుఁ దనకూఁతురు రతిమంజరింజీరి యిట్లనియె.

వుత్రీ! వీరవర్మతమ్ముఁడు రాగవర్ధనుఁడనువాఁడు ఎందోపోవుచు గాలివానందడిసి తడిపుట్టములతోఁ బెద్దసత్రమునందు నిలువంబడి యున్నాడట. వానియన్న వీరవర్మ మనకుఁగావించిన మేలు వేయి జన్మములకైన మఱువఁదగినదికాదు. మిదండ్రిగారూరలేదు. మంత్రి ప్రముఖులకు వార్తనంవునప్పటికిఁ బ్రొద్దుపోవఁగలదు. నీపరిచారికలలోఁ దెలివిగలదానినందుఁబంపి వానిరప్పింపఁగలవా! అనియడిగిన రాజపుత్రిక నవ్వుచు నిట్లనియె.

అమ్మా! అంతతెలివిగలపరిచారిక లెవ్వరునులేరు అట్లుపోయి తీసికొనివచ్చినను నాతో మాట్లాడి గౌరవింపదగిన పురుషుఁడెవ్వఁడు నిందులేడుగదా. కావున నేనుపురుషవేషమువైచికొనిపోయి వానిందీసికొనివచ్చెద రాత్రివిందుజేసి మఱునాఁడుపంపుదుముగాక అట్లైనమాటదక్కగలదు. అందులకు నీకు సమ్మతమైనంజెప్పుమని యడిగిన నప్పటికి వేఱొకతెఱువు లేమింజేసి యట్లుచేయుట కంగీకరించినది.

రతిమంజరితృటికాలములోఁ బురుషవేషమువై చిగుఱ్ఱమునెక్కి పాణిద్వారముననాసత్రమున కఱిగినది. ద్వారమునగుఱ్ఱమునుదిగిలోపలికిఁబోయి యిందు రాగవర్ధనులెందున్నారని విమర్శించుచుఁ దిరుగుచుండఁదడిగుడ్డలబిండుకొనుచు జలిచేవడకుచు నొకయఱుగుపయిఁ గూరుచున్న రాగవర్ధనుండు ఆమెమాటలు విని నేనే రాగవర్ధనుండనని చెప్పెను.

రాజపుత్రికయతనియాకార సౌష్ఠవమునకచ్చెరువందుచుఁ జేయి పట్టుకొని వయస్యా ! నేనీనగరాధిపతిజయదేవునికుమారుండ మీరాక చారులవలనవిని యరుదెంచితిని. మాతండ్రియూరలేఁడు మీరుతడిసి యిందున్న వారని విని యరుదెంచితిని యీపీతాంబరంబుల ధరింపుడు.