పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/138

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతలరాజ్యముకథ.

125

జూడగలిగితిరేని వెంటనే మీక్షేమము తెలియఁజేయుఁడు. ఒక్కదివసంబెల్ల నీనిగళంబిట్లుంచి తిరుగాఁ బైకిలాఁగికొందుము.

ఇట్లు మీప్రియ సోదరుఁడు, ప్రతాపరుద్రుఁడు.

అపత్రికం జదివికొని వీరవర్మ తమ్మునితోఁగూడ నుబ్బిగంతుల వైచుచుఁ దమతమ్మునికట్టి యుపాయము తోపించినందులకు భగవంతున కనేక నమస్కారములుగావించుచు నానగరంబున మహోత్సవములు పెక్కు సేయునట్లు చాటింపఁబంపెను. మఱియు నప్పుడే మఱియొక పత్రికవ్రాసి మడిచి యాయినుపగుదెయరలోఁబెట్టి చీలబిగించెను. అందు మాముద్దుతమ్ముఁడు ప్రతాపరుద్రుని బ్రీతిపూర్వకముగా నాలింగనముజేసికొని వీరవర్మయు సుధన్వుఁడును వ్రాయునదియేమనఁగా, అతలమను పేరుగల యీపాతాళలోకమందు మేమిరువురమే యధిపతులమై భూలోక విలక్షణములైన మహైశ్వర్యము లనుభవించుచుఁ ద్రిలోకాతీతసౌందర్యంబునం బ్రకాశించు భార్యలం బెండ్లియాడి మహానంద మనుభవించుచున్నారము కాని జన్మదేశప్రాణబంధు వియోగంబునంజేసి యయ్యానందంబు రోగపీడితునకుఁ జేయు విందువలె హృదయరంజకంబుగాకున్నది. మనదేశమునకువచ్చు మార్గముదెలియక తొట్రుపడుచుంటిమి. మొన్ననీవు బిలంబునం బడనేసిన కపటముని శిష్యుఁడిందుఁబడియెను వానివలన నీవృత్తాంతము గొంత తెలిసికొంటిమి. నీవుజంపినవాఁ డలంబుసుఁడను రాక్షసుఁడు ఈయతలమును బాలించుచున్న వజ్రకంఠుని యాహారము నిమిత్తమై మనుష్యుల మాయఁజేసి యదానవుఁడు మునివేషముదాల్చి యిందుఁ ద్రోయించుచుండును. ఈ బిలముమయుఁడనువాఁడు నిర్మించెను. అని తానాబిలములోఁ బడినది మొదలు నాటితుదివఱకు జరిగిన కథయంతయు వ్రాసి మఱియు నిట్లు తెలియజేసిరి.

వినుమిందుఁగల రత్నములు, బంగారము, స్వర్గలోకమందైన