పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/137

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యెక్కి నివరములోఁ బడిపోయిరికాఁబోలు. ఆబిలమార్గము దిక్పతినగరములకుఁ దీసికొనిపోవునా? అని యెఱుంగనివాఁడుబోలె నడిగితిని. వాఁడు నామాట నిజమనుకొని యోహో! నీవాబల్ల యెక్కలేదా! అది యెక్కినతోడనే యొఱిగి స్వర్గమునకుఁ దీసికొనిపోవును. నీవు మొదటినుండియే మరలివచ్చితివి. తప్పుపనిచేసితివి తిరుగఁబోయి యెక్కుమని పలుకుచుండగనే నేను తొత్తుకొడుకా! నీకపట మెఱుంగననుకొంటివిరా? ఆవివరమునంబడినవారేమగుదురు? నిజము చెప్పుము లేకున్న నిన్నిప్పుడే ముక్కలుక్రిందఁగోసెదనని యదలించుచు నెడమ చేతితో జటాకలాపముఁబట్టుకొనితిగి చితిని. అవియంటింపఁబడినవగుటఁ జేతిలోనికూడివచ్చినవి. వాఁడు మొఱ్ఱోయని యఱచుచు నాపైఁదిరుగబడి యదలింపఁదొడంగెను. ఖడ్గంబు నుంకించుచు నొక్కవ్రేటున వానితలనఱకి పారవైచితిని అంతలో మన వీరులందఱుమూఁగికొనిరి. వాఁడు కపటాత్ముడనివిని దండనాఁధు డాశ్చర్యమందుచు నయ్యయ్యో తెలిసికొనలేకపోయితినే యెఱింగినచో వీనిమేను తునకలుగానఱికి కాకులఁకుఁ బాఱవేయకపోవుదునా అనిపలుకుచునాకపటము గ్రహించినందులకు నన్నుఁబెద్దగానగ్గించెను. పిమ్మట నందున్న వాని పరిజసమునెల్ల వెదకి వెదకి మన వీరులు హతముగావించిరి. సేనలతోఁ గొండయెక్కి స్వాధీనపఱచుకొని యందలి వింతలుజూచుచు మిమ్ము గుఱించి వితర్కించుచు నాలుగుదివసములా గుహాముఖంబున వసించితిమి.

అప్పుడు నాకు భగవంతుఁడీ యూహతోపించెను. మీరుబ్రతికియుందురా ఈజాబుజూచి ప్రత్యుత్తరము వ్రాయుదురు. లేనిచో జేయఁదగినది లేదుకదా! ఇదియే కర్తవ్యమని యూహించి గుహాముఖంబున నొకయంత్రచక్రమమరించి దాని కీగొలుసు దగిలించి చివర బరువైన యీయినుపగుండు దగిలించి దిగవిడిచితిమి దీనివలన దీని లోతెంతయున్నదియుఁగూడఁ దెలియఁబడగలదు. దైవకృపచేమీరీకమ్మ