పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/136

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతలరాజ్యముకథ.

123

అప్పుడు వాఁడు నన్నుఁ గన్నులెత్తి చూచి గౌరవించుచురాజపుత్రా! మీయన్నలు మాశైలకూటమెక్కి యందలి గుహావిశేషములు పరికించుచు దిరుగరారైరి. అందుండిచూచిన దిక్పతుల నగరములన్నియుఁ గనంబడఁగలవు, అందులకు నేనేమి జేయఁగలను. అపూర్వవస్తుదర్శన మెట్టివారిచిత్తమునైన నాకర్షింపకమానదు. నీకు మాశిష్యుని సహాయముగానిత్తును. నీవుకూడ నాకొండయెక్కి యందలి వింతలుచూచి యన్నల వెంటబెట్టుకొనిరమ్ము పొమ్ము. అని పలుకుచు శిష్యున కేదియో కనుసన్నఁజేసెను. ఆసంజ్ఞలు జూచుటచే నాయనుమానము మఱింతబలమైనది. కొండశిఖరమున నేదియో కపటమున్నదని నిశ్చయించి యాశిష్యునివెంటఁ గొండయెక్కుచు వానితోఁ గొంతముచ్చటించితిని. వానిమాటలన్నియు నసత్యములని తెలిసికొంటి గుహలోనికింబోయితిమి. వాఁడునన్ను ముందునడిపింప వలయునని చూచెఁగాని నేనొప్పుకొనలేదు. గుహలో నొకచో నిలువంబడియాబల్లయెక్కి చూడుము. మీయన్నలు దిక్పతులు నగరములు గనంబడునని చెప్పిన నేనదికపటమని గ్రహించి వాని మెడబట్టుకొని నీవచూడుమని యాబల్లమీఁదికి గెంటితిని. మీట సడలి యాబల్ల యొఱిగినది. వాఁడాగర్తములోఁబడిపోయెను. మీరుగూడ నట్లుబడి యుందురని నిశ్చయించి పట్టరాని కోపముతో నాయతింజంపఁదలచి ఖడ్గముచేతంబూని రెండు జాములెక్కినకొండ రెండు గడియలలోదిగి రౌద్రావేశముతోఁబోయి యహంకారము ప్రకటింపక వానిదాపునకుఁబోయి నిలువఁబడితిని,

నన్నుఁజూచివాఁడు భయపడుచు రాజపుత్రా! పోయివచ్చితివా మీయన్నలు గనంబడిరా! మాశిష్యుఁడేడీ? అనియడిగిన నేనిట్లంటి. స్వామీ! మీశిష్యుఁడు మాఅన్నలజూడఁ బోయెను. ఆగుహాంతరమున నామీట యమరించితిరేమిటికి? మాయన్నలుగూడ నాబల్ల