పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/135

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

కాశీమజిలీకథలు - పదియవభాగము.

తో ధనుర్బాణములుధరించి నన్నా సేనానివేశము కడకనువుఁడు వారి సేమమరసివచ్చెద మీరిట్లు విచారించినఁ బ్రయోజనమేమని పలుకుటయుఁ దండ్రిగారనుమతించి యారౌతుల వెంటనతని నంపిరి.

అతండును దురగారూఢుండై యాసాదుల వెంట నరుగుచుండ నొకనాఁడొక మార్గమధ్యంబున సంవర్త సమయంబునంబోలె మహా రౌద్రముగా గాలివానపట్టి బిట్టుగా వానగురియ మొదలు పెట్టినది. వారావాతాఘాతంబునకు వగచుచు వానందడిసి దారితప్పి యెట్ట కే చీకటిపడునప్పటికి నతిప్రయత్నమున నా ప్రాంతమందున్న జయపురమను పట్టణమును జేరికొనిరి.

తద్దేశాధిపతిజయదేవుఁడు మీచే సంగరమున నోడింపఁబడి తిరుగ స్థాపింపఁబడినవాఁడని యెఱింగినవారగుట నారౌతులతని నొక సత్రములోనిలిపి యావార్త కోటలోనీకిం దెలుపనరిగి తిరుగవచ్చి చూచునప్పటి కారాగవర్ధనుఁడందుఁ గనంబడలేఁదట. అతనినారాత్రి యెల్ల వెదకి మఱునాఁడువెదకి యతని జాడతెలియక యాదూతలు వెండియు మనవీటికరుదెంచి యాయుదంత మెఱింగించి మన తలిదండ్రుల శోకవిహ్వాలులఁ గావించిరి.

అప్పుడు నేనును జయమల్లుఁడునుధనుర్బాణములుధరించి వారి నూఱడించుచు వారియనుమతి వహించి బయలుదేరితిమి. కొంతసేనను సహాయముగానిచ్చి మససోదరు జయమల్లుని జయపురంబున కనిపితిని నేను ఖడ్గమాత్రసహాయుండనై తురగమెక్కి సేనానివేశమున కరుదెంచితిని. అందున్న చమూపతి నన్ను జూఁచి యచ్చటివృత్తాంతమంతయు నెఱింగించెను. పిమ్మట నేనాలోచించుచు నాయతియొద్దకుంబోయితిని. వానింజూచినతోడనే కపటాత్ముడని నాకు నంకోచముగలిగినది. నమస్కరించుచు నా కులశీలాదులెఱింగించి మీజాడ తెలుపుమని యడిగితిని.