పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/134

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతలరాజ్యముకథ.

121

నము జేసికొనియే యుండును. కానిమ్ము మనల మృత్యుముఖంబునుండి తప్పించి రాజ్యపట్ట భద్రులంగావించిన భగవంతుఁడిప్పు డెందుఁబోవును? అమ్మహాత్ముఁడే మనకాదారిగూడఁజూపఁ గలడని పలుకుచుఁ దమ్ముని యుంగర మంగముల నద్దికొని ముద్దుపెట్టుకొనుచుఁ దద్దయుఁబ్రీతితోఁ దనభార్య కత్తెఱంగంతయు నెఱింగించెను.

మఱియు వారిరువురు సంతతము బిలద్వారనికటంబుననే వసించి యందుండి యేదియైన వార్త వచ్చునాయని యాలోచించుచుండిరి. ఒకనాఁడందలి ఘంటాటంకారధ్వని వినంబడినంత వీరవర్మ సంతోషముతో దమ్మునికిఁదెలిపి పానుపుసవరింప నియోగించెను. అంతలో నొక యినుపగొలుసు చివరగట్టిగా గట్టఁబడిన గుండొకటి జారి యాతల్పంబునం బడినది. రాజకుమారులు విస్మయముతోఁ జూచుచు నా యినుపగుండు గొలుసు వీడదీసి విమర్శించిచూడ నందొక బిరడా గనంబడినది. దానిందీసినంత నందొకపత్రికయున్నది. ఉత్సాముతో నా పత్రికందీసి వీరవర్మమేను పులకింపనిట్లు చదివెను.

అన్నలారా! మీదిగ్విజయయాత్రా వృత్తాంతము చిట్టచివరఁ గొన్నిదినములు వినక మన తలిదండ్రులు పరితపించుచుండ దండనాధుండు చిత్రకూట నగపార్శ్వమునందున్న సేనానివేశమునుండి తండ్రి గారికొక సందేశపత్రిక నంపించెను. అందు మీ యిరువురునొకమునీశ్వరుని ప్రేరణంబున నందలి గిరికూటమెక్కి తిరుగరాలేదనియుఁ బది దినములు వేచితానాఋషినడిగినఁ దనకేమియు సమాధానము చెప్పక శపింతునని బెదిరించెననియు నిటుపైనఁ గర్తవ్యమేమని తెలియఁ జేయఁ గోరుచున్నానని వ్రాయఁబడియున్నది. ఆవార్త విని మనతలిదండ్రులు దారుణముగా శోకించుచుండిరి. అమ్మగారి జాలిగుండె తెఱంగు మీ రెఱింగినదియేగదా! పుత్రులందఱము మూఁగి యామెనోదార్చితిమి. వారి యాఱవకుమారుఁడు రాగవర్ధనుఁడు రౌద్రావేశము