పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/133

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఆమాటలువిని సుధన్వుఁడు కోపముపట్టఁజాలక వానింజంప నుంకించుటయు వీరవర్మ వారించుచుఁ దమ్ముఁడా! వీఁడు మనకు శత్రువైనను మనతమ్ముని క్షేమవార్తఁ దీసికొనివచ్చెను. వీనివలన మన మక్కడివృత్తాంతము దెలిసికొందముగాక తొందరపడకుమని వానికిఁ దెలియకండఁజెప్పి యోరీ! నీకీయలయిక యెట్లైనఁ బదిదినముల దనుక తీఱదు. నీకతంబున మనయేలిక వజ్రకంఠునికి నిత్యము నరమాంసము దొరకుచున్నది నీవుతిరుగా నందుఁబోవలయును. ఎప్పుడుపోయెదవు? అని యడిగినవాఁడు కన్నులు మూసికొనియే యిట్లు చెప్పెను.

మిత్రులారా ! నాకు నొడలేమియు స్వాధీనములో లేదు. మీరు జేసిన యుపచారములవలనఁ బ్రతికితినికాని చావవలసినదే. బలము గలిగినపిమ్మట భూలోకములోని కరిగెదంగాక, నన్ను రాజునొద్దకుఁ దీసికొనిపొండు. నాబన్న మాయనకు నివేదించి యేగెదను. అని పలుకుటయు వీరవర్మ, నిన్ను నేలికయొద్దకిప్పుడే తీసికొనిపోయెదము. నీకష్టములన్నియుఁ జెప్పెదము. నీకతనిచేఁ బారితోషిక మిప్పింతుము వెరవకుము నీవు భూలోకమున కే దారిఁబోయెదవు! ఈవివరములో నుండి పోవఁగలవా! అనియడిగినవాడు కన్నులఁ దెరచిచూచి రాజ కుమారులం గురుతుపట్టి వెరచుచు నది స్వప్నమేమోయని భ్రాంతిపడి క్రమ్మఱఁ గన్నులమూసికొనియెను. పిమ్మట వారేమియడిగినను బ్రత్యుత్తరమియ్యడయ్యెను.

అప్పుడు వీరవర్మ వానిం బందీగృహంబునఁ బడవేయుఁడని యాజ్ఞాపించి తమ్మునితో వత్సా! మన ప్రతాపరుద్రుఁడు మన మీగుహలోఁ బడిపోయితిమని తెలిసికొనియుండును. అలంబసుడుచేయు కపటము గ్రహించియేకదా వీని నిందుఁబడద్రోచెను. అతండు మిగుల బుద్ధిమంతుడు మన వృత్తాంతము దెలిసికొనుట కేదియో సాధన మాలోచింపక మానఁడు. అలంబుసు నీపాటికిఁజంపి యాకొండ స్వాధీ