పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఈసుపాణి నిదివఱకే గ్రహించితి నిది క్రొత్తకాదని యతం డుత్తరమిచ్చెను. నాడెల్ల యావృత్తాంత కధనముతో వెళ్ళించిరి.

నాటంగోలె రాజపుత్రు లిరువురు భూలోకమున కేగు మార్గ మరయుచు నొకనాఁడు బిలముఖంబున కరిగియందలి విశేషములు పరికించుచుండిరి. ఇంతలో లోపలిగంట మ్రోగినది. ఆమ్రోఁతవిని వారది యేమని యడిగిన నిప్పుడేదియో జంతువవచ్చి పడుచున్నది. అందులకే మ్రోగినదని కాపున్నవాఁడు చెప్పెను. అప్పుడప్పుడువాని జాగ్రత్తగాఁ గాపాడవలయునని పలుకుచు మెత్తని పాన్పులు సవరించి వేయించిరి. వారు సూచుచుండ జరజర జూరి మునిశిష్యుండొక డందుఁబడియెను. వానికిఁదగిన యుపచారములు సేయించుటచే వెంటనే యతనికిఁ దెలివివచ్చినది. వానిలో నొకయుంగరము కూడ జారిపడినది. దాని సుధన్వుండు కని అన్నా! చూడు. చూడు. ఇది మన తమ్ముఁడు ప్రతాపరుద్రునిదివలె నున్నది. ఇందలి విలాసము పరికింపుము. అని చూపుటయు నౌను వానిదే. వాఁడు గూడ నిందు జారిపడుచున్నవాఁడేమోయని తొందరపడుచు మెత్తని పఱుపులు. సవరించి యందు వేయించెను.

పిమ్మట మునిశిష్యుంజూచి యోహో! వీఁడా కపటయతిశిష్యుఁడు నాఁడుమనలను బెదరించినవాఁడు వీఁడే. వీనింబట్టికొని నిర్భంధించిన నిజము దెలియఁగలదని తలఁచుకొనుచు వా రిరువురు వాఁడు విశ్రాంతి వహించిన పిమ్మట నీ వెవ్వఁడవు. ఇం దేమిటికి పడితివని. యడిగిరి. వానికింకను బూర్తిగాఁ దెలివిరాలేదు. అట్లడిగినవారు వజ్రకంఠుని యాప్తులే యనుకొని మెల్లగా నిట్లు చెప్పెను.

మిత్రులారా! నేను భూలోకములోఁ జిత్రకూటనగపాదమున నున్న యలంబుసునిపరిజనుండ శిష్యరూపముతోఁ దిరుగుచు మనుష్యు..ల నాగుహాంతరమునఁ ద్రోయుచుందును. ఇరువురు రాజకుమారుల