పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/129

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కాశీమజిలీకథలు - పదియవభాగము.

క్రొత్తనిబంధనల నేరుపరచి విశ్వాసపాత్రులగు దూతలఁగొందఱగాపు పెట్టించెను. నరాంతకుని మేనకోడలు రత్నావతి తనతమ్ముని వరించి యతనిమరణమునుండితప్పించినవార్త భార్యవలనవిని యున్నవాఁడగుటా వెంటనే యావాల్గంటి దనయింటికి రప్పించుకొనియాదరించుంచుండెను...

ఒకనాఁడతండు కొల్వుకూటంబలంకరించియున్న సమయంబునఁ బ్రతీహరి యరుదెంచి మహారాజా! త్రికూటనగనివాసినియఁట కుటిలాలకయోర్తు, రాజభటవేషముతోవచ్చి ద్వారముకడనిలిచి యీకమ్మ మీకిమ్మని యిచ్చినది. అనుటయు నతండు దానినందుకొని విప్పియిట్లు చదివెను.

వజ్రకంఠా! నీవు నరమాంసోత్కంఠుడవై మనుష్యలోకంబునఁ గపటమునిఁ బురికొల్పి బోనువంటి గిరికూటబిలమార్గంబున మనుష్యులఁబడ నేయించి యిందురప్పించుకొనుచుఁ గడుపునిండించు కొనుచుంటివి. ఆతిండియే యిప్పుడు నీకు మృత్యువైనది. పాపాత్మా! కాచికొనుము. ఎంతకాలమిట్లు చేయఁగలవు! మీపూర్వులగు పలలాశనులు లోకకంటకులై యేమైరో యెఱింగినవాఁడవై తేని యిట్టి ఘోరకృత్యములు సేయఁబూనవు. లోకైకవీరుండగు మాయన్న వీరవర్మను బిలమార్గమున రప్పించుకొని కడతేర్చియుందువు. అంతటితో విడువక యాదారినేనన్ను నీయింటికిం దెచ్చికొంటివి. అదియే నీకుముప్పైనది. నాకుగొప్పయైనది క్షుద్రా! నేఁటికేడవనాఁడు నీ పురికరుదెంచి నిన్నుఁ బుత్రమిత్రకళత్రాదులతో నాశనముజేసి నీరాజ్యము గైకొందుఁ గాచికొనియుండుము ఇదియే నీకుఁగడపటిసందేశము.

ఇట్లు, సుధన్వుఁడు.


ఆపత్రికంజదివికొని వీరవర్మ సంతోషపారవశ్యంబున మేనెఱుఁగక యొక్కింతతడవునకుఁ దెలిసి కన్నుల నానందబాష్పంబులుగార నాకమ్మ గన్నులకద్దికొనుచు నా లిపింజూచి తమ్మునించూచినట్లు సంతసించుచుఁ దక్షణము యాకమ్మదెచ్చిన పొన్నికొమ్మం దీసికొనిరమ్మని