పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/127

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

కాశీమజిలీకథలు - పదియవభాగము.

భండాసురుఁడు - చండా! నిలు నిలు. నీయుద్ధ పాండిత్యంబు మే మెఱుంగనిదికాదు. అనుచిత ప్రలాపంబు లాడక వెనుకముందు విచారించుము. (వాఁడామాటబదిసారు లనుచున్నాడు.)

మహిషాసురుఁడు -- ఏమిరా చండా! ప్రేలుచుంటివి? జగదేకవీరుఁడనేనుగానా? మదీయనిశాతశృంగ ఘాతంబు రుచిచూపనాయేమి?

భండా— పశువా! అట్లన నీకుశృంగభంగంబు చేయకుందునా? రా రమ్ము. రా రమ్ము.

ముండా - భండా! శృంగమువలన భంగము నీకే కలుగును నీవనినమాటసత్యమే.

ముండా - మాటలతోనేమి. ఇదిగోకాచికొనుడు మదీయదోర్దండ ప్రచండబలపాండిత్యంబు తేటపడ గదాదండంబు వేయుచున్నాననిలేచి భండాసురుంగొట్టెను. అదివానియురంబుత్రాకిశకలములైపో యనది వెంటనేలేచి యతండు ముండాసురు నురంబునఁ బిడికిటంబొడిచి మూర్ఛనొందించెను. అతనిపాటుఁజూచి భండాసురుఁడు చండునిం గలియఁబడియెను. ఇద్దఱకు చెడ్డముష్టియుద్ధము జరిగినది. అంతలో మహిషుండు రక్తబీజుండు తలవడి యొండొరులం గొట్టుకొనఁదొడంగిరి. అట్లె యందున్న రక్కసులెల్ల రెండుతెగలై బాహుయుద్ధంబునకుఁ బూనికొని దారుణముగా బోరఁదొడంగిరి. వజ్రకంఠునికిఁగూడ నందొకపక్షముజేరక తప్పినదికాదు. క్రమంబున నాసంగ్రామంబు సంకులమగుట స్వపక్షపరపక్షంబులు దెలియక దొరికినవానింబట్టుచుఁబట్టిన వానింజంపుచు మిగిలినవానిం గవియుచుఁ జేరినవానిం బొడుచుచు నొక్కనినైనఁ బోనీయక చిక్కఁబట్టి రక్కసులెల్ల ఘోరముగాఁ బోరిపోరి యర్ధదివసములో నొండొరులచేఁ జంపఁబడి నామావశిష్టులైపోయిరి.

వీరవర్మ యత్తెఱంగరసి శరశరాసనంబులందాల్చి తురగా రూఢుండై నంగ్రామరంగంబునకరిగి హతశేషులంబోనీక సాయకనికా