పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/125

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సులకెల్ల భోజన భోజనాదివిధులకుఁ దగినసదుపాయము లపారముగాఁ గావింపఁజేసెను. దైవజ్ఞ నిర్దిష్ట సుముహూర్తమునకు మహిషాసుర ప్రముఖులెల్ల వచ్చి యాసభ నలంకరించిరి. పద్మసేనయు సముచిత భూషాంబరధారిణియై ద్విజటవెంటరా యధాకాలంబున కాసభాంతరాళముఁజేరి రాక్షసశ్రేష్ఠులనెల్లఁ గలయంగనుంగొని వారివారి వృత్తాంతములఁ దెలిసికొను కోరికతో నాసింహాసనశ్రేణీ మధ్యము నుండి మెల్లగా నడుచుచుండెను. అప్పుడు సర్వజ్ఞుండను రాక్షసపరివ్రాజకుండు త తద్యృత్తాంతముల నాకాంతామణికిట్లు చెప్పఁబూనెను.

సీ. నాతి! యీతఁడు కాలకేతుఁడు సర్వగీ
              ర్వాణదుర్దర్వ నిర్వాపణాత్ముఁ
    డతివ! యీతఁడు మహిషాసురుం డితని వి
             ఖ్యాతి సర్వజగంబులందు వెలయు
    చండముండులువీరె భండనంబున వీరి
             నవఘటింపఁగలేరు హరిహరాదు
    లువిద! శుంభ నిశుంబులురు బలాఢ్యులు వీరి
             పేరెన్నికొని నిద్రఁబోరుసురులు

గీ. వీఁడుభండాసురుం డతివీరుఁడితని
    తోడఁబోరాడు మగవాఁడులేడు మూఁడు
    లోకముల వాఁడె కను బాష్కలుండు మహిషు
    మంత్రి సర్వస్వతంత్రప్రమాణవేది.

అని యీరీతి నానారీతిలకమున కాపరివ్రాజకుండందున్న దానవశ్రేష్ఠుల కులళీలనామవిఖ్యాతు లెఱింగించుటయు నాలించియాచంచలాక్షిక్షణకాలమూరకుండి సభాసదులెల్లరువినసఖీఁ ముఖముగానిట్లు తెలియఁ జేసినది.

ఇందువచ్చిన రాత్రించరులెల్లఁ బ్రఖ్యాతులే కావచ్చును. ముఖ్యముగాఁ జూడఁదగినవి రూపము విద్య పరాక్రమము. రాక్షసజాతి