పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నావతికథ.

111

రత్నా - ఎప్పుడోయననేల? ఇప్పుడే చెప్పెద. నిఁక దాఁప నేమిటికి (అని చెవిలో నిటునిటు)

రాజ -- అమ్మయ్య! నాహృదయ మిప్పటికిఁ జల్లఁబడినది.

రత్నా - నీకతనియందింత యనుకంప యేమిటికిగలిగినది. వాని నెఱుంగుదువా యేమి?

రాజ — ఆరహస్యమంతయు నీకు మఱొక్కప్పుడు తెలియజేసేదను. అనిమాట్లాడి యాచేడియవల్ల నారహస్యముదెలిసికొని సగౌరవముగా నామెననిపినది. ఇంతలో స్వయంవరమహోత్సవదివసము సమీసించినదనియు సన్నద్ధురాలవై యుండవలయుననియుఁదండ్రియొద్ద నుండి చీటివచ్చినది. ఆచీటితీసికొని వీరవర్మయొద్దకుఁబోయి నమస్కరించుచు రత్నావతివలనఁదెలిసికొనిన విషయంబు లన్నియు నెఱింగించి నీతమ్ముఁడు నీకంటె నున్నతస్థితియందున్నాఁడు, అతనికొఱకువిచారింపఁ బనిలేదు. మఱియు స్వయంవరము సమీపించినది. పాతాళలోకములలోనుండి పేరుపొందిన దానవులందఱు వచ్చుచున్నారట. కర్తవ్య మేమి? అనియడిగిన నతండు నవ్వుచు నీయిష్టమువచ్చిన మగని నేఱుకొనుటయేకర్తవ్యమని పరిహాసమాడుటయు నాయువతి చెవులు మూసికొని ఇది పరిహాససమయముగాదు. ఈయాపద యెట్లుదాటునని నాహృదయము పరితపించుచున్నది తగినయుపాయ మెఱింగింపుఁడని యడిగిన నతండు ప్రేయసీ! నీకుఁ బదిసారులు చెప్పవలయునా. ఇదివఱకు నీకెఱిఁగించియేయుంటిని. అట్లేచేయుము కార్యసిద్ధియగునని యుపదేశించెను. ఆమెయంగీకరించి యందులగుఱించియే వితర్కించుచుండెను.

పద్మసేన మిక్కిలి చక్కనిదని పాతాళలోకములన్నిట వాడుక మ్రోఁగియున్నది. రాక్షసులు సహజకామ క్రోధావిష్టులు తత్స్వయంవర ప్రకటనము వినినతోడనే చతురంగ బలసంయుక్తులై యయ్యతలమున కరుదెంచిరి. వజ్రకంఠుడు తనవీటి కరుదెంచిన రక్క