పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మున్నది. ఆరాత్రి చంపియేయిట్లనుచున్నా రేమోయనితోచుచున్నది.

రత్నావతి - రామరామ! అదివట్టియబద్ధముఎట్లైన నేమివాఁడు పాఱిపోయినమాట వాస్తవము.

రాజ — ఆరహస్యమే నాకుఁ దెలియవలసియున్నది.

రత్నా – కనుఁ గొని చెప్పెదనులెండి.

రాజ -- నీకు వివాహమెక్కడ నిశ్చయింపఁదలచినారు?

రత్నా — ఆమాట నన్నడుగవలదు నాప్రారబ్ధ మెట్లుండెనో అట్లుజరుగును హ్రస్వపాదునిపుత్రున కీయఁదలంచిరి కాని నాకిష్టములేదు.

రాజ — నీవుగూడ నాపుంతలోని కే వచ్చితివే.

రత్నా - నీకేమి? రాజపుత్రికవు స్వయంవరమున నీయిష్టము వచ్చినవాని నేఱుకొందువు. నాకెట్లు?

రాజు - నేనునీతోనిజము చెప్పుచున్నాను. రాక్షసులఁబెండ్లియాడను.

రత్నా – ఇఁక నాలుగుదినములలో స్వయంవరోత్సవ ముహూర్తమున్నదని చాటించుచుండ నట్లనియెదవేల?

రాజ - ఆచాటింపుచాటింపే. రాక్షసులవరింపను. ఇదియయథార్థము.

రత్నా — అసభకు రాక్షసులుగాక దేవతలు మనుష్యులు వత్తురాయేమి? అందెవ్వరినో యొకరిని వరింతువా?

రాజ - ముమ్మాటికిని వరింపను.

రత్నా - మఱియాస్వయంవరవిధి యేమిటికి?

రాజ - అది లాంఛనమునకే నీవు నాకత్యంతప్రియురాలవు కావున నీరహస్యము నీతోఁ జెప్పితిని.

రత్నా - మన మప్సరోజాతివారమగుట రక్కసులు వెక్కసముగాఁ దోచుదురు,

రాజ - అందులకేమనమైత్రియవ్యాజమైనదని చెప్పుచున్నాను. ఆపురుషునివృత్తాంతము తెలిసికొని యెప్పుడుచెప్పెదవు?