పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/122

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నావతికథ.

109

రాజ - సీమంతోత్సవము జరిగినదియా?

రత్నా - లేదు. అగిపోయినది. మొన్న జరుగవలసినదే.

రాజ — ఆమె యేమికోరికలు కోరుచున్నది?

రత్నా — ఏమోతల్లీ! నాకంతగాఁ దెలియదు.

రాజ — ఇక్కడనే నీవు స్నేహభావము విడిచి మాట్లాడుచుంటివి. మాట వరుస కడిగితిని,

రత్నా - (ఇంచుక సంశయించుచు) నాకు వారితో నంతగాఁ గలియదు నాతో వారి రహస్యములు సెప్పరు.

రాజ - చెప్పకున్నను నింటిలో మాటలు తెలయవా!

రత్నా - (అంతర్గతంబున) ఓహో! ఈమెకు నిజము తెలిసినట్లున్నది. అందులకే గ్రుచ్చిగ్రుచ్చి యడుగుచున్నది. చెప్పకున్న మఱియొకలాగు తలంచును. కానిము (ప్ర) నరమాంసము కోరుచున్నదని సవసవగా విన్నాను,

రాజ - ఊ. ఆమాటవినియే నేనడిగితిని. నీవు నాఁతోఁ జెప్పుటకు సంశయించుచున్నావు.

రత్నావతి - అసలు మావాళ్ళకు నాయం దిష్టములేదు. నోరు మూసికొని యుందును. ఏమన్ననుతప్పే కనుక దాచితిని. దేవీ ! నాయపరాధము సైరింపుము.

రాజు - భయములేదు మఱి నరమాంసము దొఱకినదియా ?

రత్నా - దొఱకను దొఱకినది పోవనుఁభోయినది.

రాజ - ఎట్లుపోయినది?

రత్నా - వాఁడు బలవంతుడుతలుపులువిదళించి పాఱిపోయెను.

రాజ - సఖీ! ఆమాటయేనమ్మవీలులేకున్నది. ఆకథయంతయు వింటినికాని యామాటయె నమ్మదగిలేదు సగముచచ్చియున్న మనుష్యుడు ఇనుపతలుపుల విదళింపఁగలఁడా. ఇందేదియో రహస్య