పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/120

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నావతికథ.

107

దినములక్రితమే వధ్యశిలపైఁబడియెను. వాడుసగముప్రాణములతోఁగొట్టుకొనుచుండ బడియతో బాదబోయిన లంబోదరి వారించి చంపనీయక యాకళేబరము వెనుకటివలెనే నరాంతకునింటికి దీసికొనిపొమ్మని నాకాజ్ఞాపించినది. మీపాదములతోడు నేనంగీకరింపలేదు. ఆరాత్రితానే వానిందీసుకొనిపోయి వారింటియొద్దనప్పగించినది. నానిచేతులుకాళ్లు విఱువక యొకయింటి లోఁబెట్టి గట్టిగా మేపిరట. ఒకనాఁడు బీగముల విఱుగఁగొట్టి యాజెట్టి తలుపులఁ దెఱుచుకొని మాఱుదారి నెక్కడికో పాఱిఁబోయెనఁట. నరాంతకుఁడువచ్చియాకథ చెప్పినంతలంబోదరితనకు మాటవచ్చునని యీమాదిరిగావ్రాసినది కాబోలు? ఇందునాతప్పేమి యున్నదో యాలోచింపుఁడు. మీశిక్షకుబాత్రుఁడ నగుదునని పలికిన నాకలికి యొక్కింతవిచారించి కుంభా !ఇందు నీవేమియునెఱుఁగవుకాని యీమాట దెలిసిన రాజుగారు నిన్నుఁగూడ శిక్షింపకమానఁడు. నీవజాబాయనయొద్దకుఁ దీసికొనిపోవలదు. ఇంటికిఁబొమ్ము, నేబుచ్చికొంటినని లంబోదరితోఁ జెప్పుము. అనివానినదలించి యింటికంపివేసినది.

పిమ్మట నాకొమ్మ ద్విజటతో నాలోచించినవార్త వీరవర్మ కెఱింగించి మీతమ్ముఁడు మీకంటె గండఁడువలెఁ దోచుచున్నాఁడు. ఱాతికట్టడములనడుమనుండి యెట్లుతప్పించుకొనిపోయెనో తెలియదు. వానివెదకి తెప్పింపకుండ నీచీటిలాగుకొంటిని. ఇఁకమీతమ్మునికేమియుభయముండదు. అనియోదార్చినవిని రాజపుత్రుఁడిట్లనియె,

ప్రేయసీ ! అతండు మాతమ్ముఁడగుట వాస్తవము వానిచేత నాయుధములేదు. ఆయింటిలోనుండి యెట్లు తప్పించుకొని పోఁగలడు? ఆమాట నాకు సత్యముగాఁ దోపలేదు. వానిం జంపితిని యిట్లు ప్రకటించిరేమోయని యనుమానముగానున్నది. వా రింటనున్న యాప్తులవలన నీరహస్యము తెలిసికొనవలయునని బోధించుటయు రాజ పుత్రిక యిట్లనియె.