పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీ మజిలీ కథలు.

బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షితకవిగారిచే నీగ్రంధరాజము పండ్రెండు భాగములుగాఁ బండితపామర హృద్యమగు శైలితోవచనమున రచియింపఁబడి యున్నది. ఈకధలు ఆంద్రదేశమంతటను వ్యాపించియుండుటనుబట్టి వీనిగుఱించి విస్తరించి వాయఁబనిలేదు.

ఇందుఁబతివ్రతలప్రభావము దుష్టస్త్రీలకుచ్చితచేష్టలు, సత్పురుష సాంగత్యమువలనఁ గలుగు లాభములు, దుష్టసహవాసంబునం గలుగు ననర్ధములు, దేశాటనము పండితసంపర్కమునగలుగు జ్జానము రాజనీతి, వ్యవహారవివేకము, వదాన్యలక్షణము, లోభిప్రవృత్తిలోనగు విశేషము లనేకములు వర్ణింపఁబడియున్నవి. మఱియుఁ గృష్టదేవరాయ, బోజురాజ, శంకరగురు, విక్రమార్క, నారద, ప్రహ్లాదాది, మహాపురుషుల చరిత్రములు విచిత్రముగా వాయఁబడియున్న వి. ప్రతికథయందును నేదియో మంచినీతియుండక మానదు.

ఈకధలు విరక్తులకు వేదాంతవార్తికములు, జ్ఞానులకునుపనిషత్తులు, కర్మిష్ఠులకు స్మృతులు, వైదికులకు ధర్మశాస్త్రములు, యువకులకు గావ్యములునై యొప్పుననుటకు సందేహములేదు. ఏకథయైనను ప్రారంబించినతరువాత దుదముట్టువరకు చదివినంగాని విడువ బుద్ధిపుట్టక పోవుటయే యీకధలయందలి చమత్కారము. పేక్కేల యిక్కధలు సర్వజనాహ్లాదకరములై యున్న వని నొక్కి వక్కాణింపుచున్నాము. ఇందులకు లోకమే ప్రమాణము.

ఇప్పటికి 12 భాగములు అచ్చుపడి సిద్ధముగానున్నవి.

12 భాగములు అనుబంధము సహితము అన్ని భాగములు ఒకేసారి కొనువారికి వెలలో కొంతతగ్గించి పంపబడును. పోస్టుఖర్చులు కొనువారే వహించికొనవలెను. పలయువారు యీదిగువ అడ్రస్సుకు వ్రాయవలెను.

మధిర సుబ్బన్న దీక్షితకవి అండుసన్

వుల్లితోటవీధి – రాజమండ్రి