పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఆజాబు కుంభునికిచ్చి రాజుగారియొద్ద కనిపినది. వాఁడాయుత్తరమును దీసికొనిపోవుచుండ దారిలో రాజపుత్రికయగు పద్మసేన పరిచారిక ద్విజట వానికెదురుపడినది. అదివానింగురుతుజూచి యోరీ! నీవు నాఁడుమాకుఁ దోటలోఁగనంబడినవాఁడవుకావా! నీకొఱకేపోవుచుంటిని భర్తృదారికనిన్నుఁదీసి గొనిరమ్మన్నదిపోవుదమురమ్ము. అని పలికిన వాఁడు అమ్మా! నేనునాఁడుచూచిననాఁడనే అమ్మగారికి నామాట జ్ఞాపకమున్న దా! నాపనియేమివచ్చినదో! అట్లేవచ్చెదను. ఈ యుత్తరము రాజుగారికిచ్చి వచ్చెద నంతదనుక గడువీయుఁడని వేడుకొనియెను. ద్విజట యాచీటీయేదీ యిటు తే! యేమ వ్రాసిసదోచూచెదంగాకయనిలాగికొని విప్పిచదివి రా రమ్ము. ఈకమ్మలోనంతయగత్యమైనపని కనిపింపదు తరువాతఁబోవుదువుగాక. అని వానిబలవంతముగా శుద్ధాంతముసకుఁ దీసికొనిపోయి రాజపుత్రిక కత్తెఱం గెఱింగించినది.

అబోఁటిచీటింజదివికొని కుంభా వధ్యశిపైఁ బడినిన్నుఁజావమోదియెవ్వఁడో పారిపోయినట్లిందు వ్రాయఁబడియున్నది.వాడెన్ని యేండ్లవాడు. పోలికయెట్లున్నది. నిజముచెప్పుము. లేకున్ననిన్ను దండింపఁజేయుదునుచుమీ యనియడిగిన వాఁడుగడగడలాడుచు జోహారుచేసితల్లీ మీకడనబద్ధములాడుదునా? వాడుఅచ్చముగానాడు మీరు దీసికొని పోయినవానివలెనున్నాఁడు. వారిద్దఱు నన్నదమ్ములు గావచ్చును. అనియెఱింగిన రాజపుత్రిక విస్మయసంభ్రమములతో నిట్లనియె.

కుంభా! వాడుఱాతిమీఁదబడినతోడనే యెట్లులేచినిన్నుఁగొట్టగలిగెను? వాఁడంత బలంవంతుడా యేమి? అచ్చముగా నేమిజరిగినదియో చెప్పుము మాకంతయుఁ దెలిసినదిలే! నీవుదాచిన దాగునను కొంటివా యని అడిగినవాఁడు చేతులుజోడించి అమ్మా! నేనేమియుఁదప్పుజేసియెఱుంగను. మీరు వలదనిచెప్పినతర్వాత నట్టిపని చేయుదునా అంతయులంబోదరియేచేసినది మీరు తెలిసికొన వచ్చును. అమానిసి పది