పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యేనుఁగుల బలముగలుగునట్లు చేయుదుము. మమ్ముఁ గలిసినపిమ్మట బరమేశ్వరుఁడైన నాకుఁ జాలఁడని నీకొకగరువము గలుగఁగలదు. ఇందు నవనిధులు గలిగియున్నవి భాగ్యంబున నీకుఁగుబేరుఁడు సరిపడఁడు నీకిందుఁగొదవయేమున్నది. మేము నీకేది యభీష్టమో అట్లు మెలంగువారము మన్మధసాంమ్రాజ్యపట్టభద్రుండవై క్రీడింపుమని ప్రార్థించుచు నతనిమెడలోఁ బూవుదండలువైచిరి. పరిజనులందఱు కరతాళంబులు వాయించిరి.

తాళధ్వజుని రెండవకమారుఁడగుసుధన్వుండాకాంతాత్రితయముంబెండ్లియాడి యపూర్వక్రీడా వినోదములతోఁ గాలక్షేపముచేయుచుండెను.

అని యెఱింగించువఱకుఁ గాలాతీతమైనది పై థ తరువాయి మజిలీయందిట్లు చెప్పందొడంగెను.

___________

219 వ మజిలీ

రత్నావతికథ.

రత్నావతి! సుధన్వుడరిగిన రెండుదినములదనుక వారి కేమియుం జెప్పక మూఁడవనాఁ డాహారము దీసికొనిపోయియంతలో గ్రమ్మఱవచ్చి అయ్యో! అయ్యో! ఆబద్ధపురుషుఁడేమయ్యునో తెలియదు. అందులేడు తలుపులబీగములు పగులగొట్టఁబడియున్నవి. వచ్చిచూచుకొనుఁడని లోపలికివచ్చి కేకలువైచినది. ఆమాటలువిని తటాలునవచ్చి నరాంతకు డాగదులన్నియువెదకి వానింగానక పరితపించుచునక్కటా! వీడుగజదొంగవలెనున్నాడు. సామాన్యునకీ కవాటములబీగములు విడఁగొట్టశక్యమా? దొంగలతల్లికి నేడున భయ మనినట్లీయవమాన మెవ్వరికిఁ జెప్పరాదు. అసమర్ధుండ నాభార్యకోరికఁ దీరుపలేక పోయితినిగదా! రేపుసీమంతోత్సవ మాపిమఱియొక ముహూర్తముంచిన లంబోదరి